18, మార్చి 2012, ఆదివారం

(ఆన్ లైన్ లో ) ఒకసారి చదవండి అర్థం అయితే పర్లేదు కాకున్నా పర్లేదు...

న్లైన్లో
మీ పరిచయస్తులు వారి పర్సనల్ వివరాలే కాకుండా, మామూలు వివరాలు
కూడా చెప్పకుండా స్నేహం చేసేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటివారు
ఎంతసేపూ వారి ఆనందాన్ని వెదుక్కొని, ఆనందాన్ని పొందుతుంటారే గానీ,
ఎదుటివారిని గోరింటాకులా వాడుకొనే అవకాశాలు మెండు. కాని ఇలాంటివారికే ఆన్లైన్ స్నేహాలలో పిచ్చ క్రేజు.
న్లైన్
కి వచ్చేసి, మనకి విజిబిలిటీ లో ఉన్నప్పుడు మనం పలకరించినప్పుడు పలకక,
బీజీగా ఉన్నట్లు పోజులు కొట్టేవారికి దూరముగా ఉండటం మేలు. ఇలా ఎందుకు
చెబుతున్నాను అంటే - అలా పలకరించినప్పుడు "
కొద్దిగా బీజీ గా ఉన్నాను, ఫైవ్ మినట్స్ ప్లీజ్.."
అని చెప్పోచ్చును కదా.. అలా చెబితే కాస్త మర్యాదగా కూడా ఉంటుందిగా. మీరూ
మనో వాక్యులత చెందరు. ఇలా చెప్పనివారు మళ్ళీ పలకరించినప్పుడు కాస్త దూరముగా
ఉండటమే మీకు మంచిది.
కవేళ
చాట్ చేస్తున్నప్పుడు వెంటవెంటనే ఏమీ మాట్లాడక, ఇంకా చాట్ లోనే మనల్ని
నిలబెట్టి, మన అమూల్యమైన సమయం వృధా చేసినవారిని మన్నించకండి. మధ్యలో పవర్
పోయి ఉండొచ్చును. అలాంటి పరిస్థితుల్లో మీరు రెండు నిమిషాలు ఎదురుచూడండి. ఆ
తరవాత ఏమీ అటునుండి రాలేదు అనుకోండి. ఇక సింపుల్ గా బై - హావ్ ఎ నైస్ డే
అని చెప్పేసి ఆ చాట్ క్లోజ్ చెయ్యండి. ఆ తరవాత వారి నుండి ఏమీ రాకపోతే ఇక
వారికి దూరముగా ఉండండి. వారికి స్నేహితులతో ఎలా వ్యవహరించాలో తెలీదు
అన్నమాట.
నిజాయితీగా,
నమ్మకముగా... ఉండేవారితోనే మీ స్నేహాన్ని, మీ భావాలనీ, వ్యక్తిగత
విషయాలనీ, ఫొటోస్ షేర్ చేసుకోండి. మిగిలిన వారితో హలో అంటే హలోగా, పోలో
అంటే పోలో గా, పరిచయస్థులుగా ఉండండి. వారు స్నేహపరముగా దగ్గర అవటానికి ఒక
అడుగు ముందుకు వేస్తే, మీరూ మరో అడుగు ముందుకు వెయ్యండి. అంతేకానీ అన్నీ
స్నేహాలుగా ఫీల్ అవకండి. ముందే చెప్పాను మరియు మరీ మరీ గుర్తు
పెట్టుకోండి.. -
పరిచయాలు వేరు, స్నేహాలు వేరు. రెండూ ఒకటే అని అనుకుంటేనే మీకు చిక్కులు మొదలవుతాయి. ఇలా
జాగ్రత్తగా ఉండటం తప్పేమీ కాదు. ఈరోజుల్లో మరీ అవసరముగా మారింది అని నా
భావన. నేనూ ఈ మధ్య అలాగే ఉండటం నేర్చుకున్నాను. అందుకే నా లిస్ట్
పెరుతున్నా మల్లీ తగ్గించేస్తా రెస్పాండ్స్ ఇవ్వన్ని ఇరెస్పాండ్ వాళ్లను
అరటి తొక్కలా తీసి పారేస్తా.....
అర్థం కాక పోతే మళ్ళీ చదవకండే..చదివినా అర్థం కాదు..అందుకే
                                      
                   Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి