‘స్ర్తి’గా జన్మించ(లనుకోవ)డమే ఒక శాపమా...! చేసుకున్న పాపమా.....
****** కొడుకు పుట్టడానికైనా స్త్రీ కావాలి గదా? *******
అమ్మాయిలు.. దీపంలా ప్రతి ఇంటా వెలగాలి.. మరి కొన్ని దీపాలు..వెలిగించాలని..మనఃస్పూర్తిగా .. కోరుకుంటూ ఈ స్రాప్ రాస్తున్నాను...
బిడ్డ పుట్టక ముందే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కడుపులో ఉన్నది ఆడ పాప అని తెలిసిన వెంటనే అబార్షన్ చేయించేస్తున్నారు...లింగ నిర్ధారణ పరీక్ష చేయలేని పరిస్థితుల్లో పుట్టిన పాపను చెత్త కుప్పల్లో, కాల్వలలో , గోనె సంచులలో వేసి విసిరి పాడేస్తున్నారు..ఎందుకు ఇంత చులకన ... ఎందుకీ నిర్లక్ష్యం..అసలు
ఈ
సమాజం ఎక్కడికి పోతోంది. మానవ సమాజం ఏ దిశగా పయనిస్తోంది.మానవ మనుగడకు
ముప్పు వాటిల్లబోతోంది. స్ర్తిపట్ల, ఆడ శిశువు జనం పట్ల మగ
సమాజం, అత్తల్లాంటి స్ర్తి సమాజం ఆలోచనా సరళి ఎందుకు లోపభూయిష్టంగా
ఉంటోంది? ‘ఆడ’ సంతతిని తగ్గిస్తే మానవజాతి ఉంటుందా! మనుగడ ఎలా
కొనసాగుతుంది? పురుషులు జన్మించేది ‘స్ర్తి’ గర్భంనుంచే కదా! స్ర్తిలు
లేకుండా మగజాతి ఉంటుందా! అసలు మానవజాతి మనుగడ ఉంటుందా!? ఈ విషయంలో
సమాజం ఎంత మూర్ఖం గా, అవివేకంగా ఆలోచిస్తోంది. మన దేశంలోనే ఈ కలుషితమైన
ఆలోచన, ఈ జాడ్యం అంటువ్యాధిలా విస్తరిస్తోంది. భారతదేశంలో ఆడ శిశువులను
కడుపులోనే చంపేస్తున్నారు. ముఖ్యంగా ధనిక
కుటుంబాల్లో, చదువుకున్న కుటుంబాల్లోను ఇలాంటి గర్భస్రావాలకు ఎక్కువుగా
పాల్పడుతున్నారని తెలుస్తుంది. కుటుంబంలో మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే రెండో
బిడ్డ తప్పనిసరి మగ పిల్లాడు కావాలనుకుంటున్నాడు. ఒకవేళ మొదటి సంతానం మగ
పిల్లాడు అయినప్పుడు రెండోబిడ్డ మగా, ఆడ అన్నది పట్టించుకోవడం లేదు. అంటే
కుటుంబంలో ఆడపిల్ల ఉందా లేదా అన్నదానిపట్ల శ్రద్ధ, ఆసక్తి కనబర్చడం లేదు.
ఇంట్లో కనీసం ఒక మగబిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు.మానవజాతి మనుగడ
అంతరించిపోకుండా ఉండాలంటే మొదట స్ర్తిలపట్ల సమాజానికున్న వివక్షపూరిత వైఖరి
మారిపోవాలి. @NET@

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి