ఈ రోజుల్లో మన౦ కాలక్షేపానికి అయినా, వినోదానికి అయినా టీవీ లని, సినిమాలని
ఎక్కువగా ఆశ్ర ఇస్తున్నాము. వాటిలో నటించిన నటులనే మన నడవడికలో,
వస్త్రధారణలో అనుకరిస్తున్నాము. ఒకసారి నెట్ లో "తెలుగు సినిమా హీరోఇన్స్"
అని టైపు చేసి చూడండి, మన పాత సినిమాలలో వాంప్, క్లబ్ డాన్సు చేసిన వాళ్ళు
ఇంకా ఎక్కువ బట్టలు వేసుకున్నారేమో అనిపిస్తుంది.. ఇప్పటి సినిమా వాళ్ళని
అనుకరిస్తూ కొంత మంది అమ్మాయిలు వేసుకునే దుస్తులు నిజం గానే రెచ్చగొట్టే
విధంగా, అసభ్యంగా ఉంటున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయం అంటూ చీరలు మాత్రమే
కట్టుకోమంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకోవటానికి, చదువుకోవటానికి బస్సు
లలో తిరిగేవాళ్ళకి కష్టం. కనుక చుడీదార్లు, సరిగా ఉండే పాంటులు, టి షర్టులు
వేసుకుంటే ఎవరికీ అసభ్యంగా కనపడరు. మన వస్త్రధారణ, మన నడవడిక చూస్తే
ఎదుటివారు మర్యాద ఇచ్చేటట్లు ఉండాలి కాని రెచ్చగొట్టి మనల్ని అల్లరి
చేసేలా ఉండకూడదు. అరాచకాలు, అత్యాచారాలు పెరిగాయంటే మన ప్రవర్తన ఎలా ఉందో
ఒకసారి ఆలోచించుకోవాలి, తల ఎత్తుకుని పబ్లిక్ పార్క్ లలో నడిచే పరిస్థితి
ఇప్పుడు ఎక్కడైనా ఉందా? నాలుగు గోడల మధ్య జరిగే వన్నీ అక్కడే
జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరిది తప్పు అనడం లేదు తప్పు ఎక్కడ ఉందో
గమనించండి అంటున్నా... చూసే కళ్ళల్లోనా లేక రెచ్చగొట్టే మన వేషధారణలోనా...?
ఫ్యాషన్ ఫ్ఫ్యాషన్ అని మోడ్రన్ కల్చర్ అని వాటి దారిన కొంత మంది వెళ్తే
భారతీయ కల్చర్ నచ్చి ఆ దారిలో వెళ్ళె వారు రోజు రోజుకు పెరుగుతున్నారు.
ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ? !
@ NET @
