11, డిసెంబర్ 2012, మంగళవారం

నేరస్థులు కాదు.!జస్ట్ ప్రేమికులు.!

ఈరోజుల్లో ఏమైనా చేయొచ్చు...
కానీ ప్రేమించకూడదు....
ఎందుకా? అదొక ప్రశ్నా?
ప్రేమించడం కన్నా పెద్ద నేరం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 
కావాలంటే... మర్డర్లు చేస్కో...

మానభాంగాలు చేస్కో... కుదరదు అంటే.... దేశ ద్రోహానికి పాల్పడు... అదీ కాదు అనుకుంటే...ఎంచక్కా
స్కాములు చేసుకుంటూ బ్రతికెయ్...
వీటిల్లో ఏది చేసినా మరణ శిక్ష పడదు తెలుసా...?
హాయిగా జైల్లో కూర్చోబెట్టి

"జజ్జనక జనారె" జీవితాన్ని కల్పిస్తారు...!
కానీ...ప్రేమించావో.... ప్రాణం తీస్తారు బిడ్డా...!
పరువు ప్రతిష్టలు గుర్తొస్తాయి...
కులమతాలు అడ్దొస్తాయి....
స్థాయి బేధాలు ఉంటాయి...
మొత్తంగా...ప్రేమ వ్యవహారాలు

ప్రాణల మీదకు తెస్తాయి...!!
కోరిన వెంటనే ఏదైనా తెచ్చిచ్చే పెద్దలు...
కాళ్ళమీదబడ్డా కనికరించనిది బహుశా
ప్రేమ విషయంలో మాత్రమెనేమో...
అంటే అది ఎంత పెద్ద నేరమో తెలియడం లేదూ??
అడగకూడనిది అడుగుతున్నావని అర్ధం కావడంలేదూ?

పాతికేళ్ళు వచ్చేదాకా అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి... వేసుకునే బట్టల దగ్గర్నుండి.....
పూసుకునే సెంటు బాటిలు వరకు...
జీవిత భాగస్వామిని మాత్రం నువ్వే
వెతుక్కుంటానంటే కుదరదురొయ్...
నీకు కావలసిన చదువు నువ్వు

చదువుకున్నంత మాత్రాన...
నీకు కావలసిన మనిషి ఎవరో నువ్వే
నిర్ణయిస్తాను అంటే ఎలా?
డిగ్రీలు... పి.జి లు చదువుకున్నోళ్లకి
తన జీవిత భాగస్వామిని ఎంచుకునే
మానసిక పరిపక్వత ఉంటుందా...
చోద్యం కాకపోతే...!! అమ్మలూ... అయ్యలూ...
ప్రేమ పేరుతో మీరు చూపించే ప్రేమంతా నిజమే అయితే.....
పిల్లకాయలకి ఏ దారి మంచిదో చూపించండి.....కానీ....
మేము చెప్పిందే సరైన దారి అని బలవంతంగా అటు తోయకండి... కలిసి బ్రతకాల్సింది వాళ్ళు....

కష్టమో..సుఖామో...వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు....
ప్రేమించిన పాపానికి... ప్రాణాలు తీయడానికి...
వాళ్ళేమీ కరడుగట్టిన నేరస్థులు కారు...
జస్ట్ ప్రేమికులు అంతేగా....??
"బ్రతుకు"నిచ్చారు కదా.....

ఇక బ్రతకనివ్వండి..."

                      
                                 Ur's.......Rasool