11, డిసెంబర్ 2012, మంగళవారం

నేరస్థులు కాదు.!జస్ట్ ప్రేమికులు.!

ఈరోజుల్లో ఏమైనా చేయొచ్చు...
కానీ ప్రేమించకూడదు....
ఎందుకా? అదొక ప్రశ్నా?
ప్రేమించడం కన్నా పెద్ద నేరం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 
కావాలంటే... మర్డర్లు చేస్కో...

మానభాంగాలు చేస్కో... కుదరదు అంటే.... దేశ ద్రోహానికి పాల్పడు... అదీ కాదు అనుకుంటే...ఎంచక్కా
స్కాములు చేసుకుంటూ బ్రతికెయ్...
వీటిల్లో ఏది చేసినా మరణ శిక్ష పడదు తెలుసా...?
హాయిగా జైల్లో కూర్చోబెట్టి

"జజ్జనక జనారె" జీవితాన్ని కల్పిస్తారు...!
కానీ...ప్రేమించావో.... ప్రాణం తీస్తారు బిడ్డా...!
పరువు ప్రతిష్టలు గుర్తొస్తాయి...
కులమతాలు అడ్దొస్తాయి....
స్థాయి బేధాలు ఉంటాయి...
మొత్తంగా...ప్రేమ వ్యవహారాలు

ప్రాణల మీదకు తెస్తాయి...!!
కోరిన వెంటనే ఏదైనా తెచ్చిచ్చే పెద్దలు...
కాళ్ళమీదబడ్డా కనికరించనిది బహుశా
ప్రేమ విషయంలో మాత్రమెనేమో...
అంటే అది ఎంత పెద్ద నేరమో తెలియడం లేదూ??
అడగకూడనిది అడుగుతున్నావని అర్ధం కావడంలేదూ?

పాతికేళ్ళు వచ్చేదాకా అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి... వేసుకునే బట్టల దగ్గర్నుండి.....
పూసుకునే సెంటు బాటిలు వరకు...
జీవిత భాగస్వామిని మాత్రం నువ్వే
వెతుక్కుంటానంటే కుదరదురొయ్...
నీకు కావలసిన చదువు నువ్వు

చదువుకున్నంత మాత్రాన...
నీకు కావలసిన మనిషి ఎవరో నువ్వే
నిర్ణయిస్తాను అంటే ఎలా?
డిగ్రీలు... పి.జి లు చదువుకున్నోళ్లకి
తన జీవిత భాగస్వామిని ఎంచుకునే
మానసిక పరిపక్వత ఉంటుందా...
చోద్యం కాకపోతే...!! అమ్మలూ... అయ్యలూ...
ప్రేమ పేరుతో మీరు చూపించే ప్రేమంతా నిజమే అయితే.....
పిల్లకాయలకి ఏ దారి మంచిదో చూపించండి.....కానీ....
మేము చెప్పిందే సరైన దారి అని బలవంతంగా అటు తోయకండి... కలిసి బ్రతకాల్సింది వాళ్ళు....

కష్టమో..సుఖామో...వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు....
ప్రేమించిన పాపానికి... ప్రాణాలు తీయడానికి...
వాళ్ళేమీ కరడుగట్టిన నేరస్థులు కారు...
జస్ట్ ప్రేమికులు అంతేగా....??
"బ్రతుకు"నిచ్చారు కదా.....

ఇక బ్రతకనివ్వండి..."

                      
                                 Ur's.......Rasool

2, డిసెంబర్ 2012, ఆదివారం

ఈ నిరీక్షణ ఎన్నాళ్ళింకా ఓ నా ప్రియతమా.....

నిరీక్షణలో

అందంగా తిరిగే అరుద్డైన జంటలను చూస్తుంటే ..
మనసూ మెత్తగా .. అడుగుతుంది ..
దురాన వున్న నీ కోసం ..
ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..
చప్పుడు చేయకుండా కదులుతుంది ..
కళ్ళు మత్తుగా ముసుకొంటై..


నాప్రాణం లో కలసిన వున్నా మీ మనసుని వెతకడం కోసం మనం ఇంకా ఎన్నాళ్ళిలా ..
lovers లా అనిపించి ఎలాగోవుంటుంది ..
మనం కలుస్తున్నాం విడిపోతున్నాం ..


కలయిక లో వున్నా తీపి జ్ఞాపకాలను ..
ఎదురు చూపుల నిరీక్షణలో నెమరు వేసుకొంటూ
క్షణ క్షణం భారం గా ..
అనుక్షణం మీద్యాసలో గడిపేస్తూ ..
వేచిచుస్తున్నాను నేస్తం మీ రాక కోసం ..
ఓ ప్రాణమా నిన్దయిన నీ రూపం నా మనసులో మేదిలీ భావాలకు ప్రతిరూపం ...

                                                           Ur's.......Rasool

అమ్మాయిలూ...నె(ట్)ఇంట్లో జర భద్రం (@ఈనాడు@)



8, సెప్టెంబర్ 2012, శనివారం

   ***** మోసపోకండి ******
మోసపోయేవాళ్ళను మేల్కొల్పండి..


ఇదిగో మనం ఏ లాటరీ టికెట్టు కొనలేదు కదా సరి ఏ లాటరీ టికెక్కు మొఖం కూడా చూసి ఉండం .. కానీ మీకు లాటరీ తగిలింది అని మాత్రం మెసేజ్ లు మెయిల్స్ వచ్చేస్తుంటాయి.. వాటిని చూసి లగెత్తుకుని వెళ్ళడం ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి... గ్రామాల్లో ఉండేవాళ్ళు అంటే సరే వారి కేమీ తెలియదని అనుకోవచ్చు కానీ పట్టణాలలో ఉండేవారు కూడా మోసపోతున్నారు... పేలగా వచ్చేస్తున్నాయి తొందర తొందరగా వారు అడిగినంత ఇచ్చేస్తు ఆఖరికి అప్పుల పాలవుతూ ఉన్నారు...ఇప్పటికైనా మేల్కోండి .. మీ పక్కవాళ్ళను మేల్కొల్పండి... మెయిల్ అండ్ మొబైల్ కు వచ్చే లాటరీ మెయిల్స్ అండ్ మెసేజెస్ అన్ని కూడా నకిలీవే వాటిని నమ్మడం వల్ల మొదటికే మోసం వస్తుంది.. కాబట్టి జాగ్రత్త పడండి.. ఉదాహరణకు
ఈ రోజు ఈనాడులో వచ్చిన కథనం ఇక్కడ పెడుతున్నాను..చదవండి... ఇట్లు...మీ రసూల్...

                                                           Ur's.......Rasool

24, మార్చి 2012, శనివారం

{ఆలోచించి సమాధానం ఇవ్వండి కోపడకుండా....}




ఈ రోజుల్లో మన౦ కాలక్షేపానికి అయినా, వినోదానికి అయినా టీవీ లని, సినిమాలని 
ఎక్కువగా ఆశ్ర ఇస్తున్నాము. వాటిలో నటించిన నటులనే మన నడవడికలో, 
వస్త్రధారణలో అనుకరిస్తున్నాము. ఒకసారి నెట్ లో "తెలుగు సినిమా హీరోఇన్స్" 
అని టైపు చేసి చూడండి, మన పాత సినిమాలలో వాంప్, క్లబ్ డాన్సు చేసిన వాళ్ళు 
ఇంకా ఎక్కువ బట్టలు వేసుకున్నారేమో అనిపిస్తుంది.. ఇప్పటి సినిమా వాళ్ళని 
అనుకరిస్తూ కొంత మంది అమ్మాయిలు వేసుకునే దుస్తులు నిజం గానే రెచ్చగొట్టే
విధంగా, అసభ్యంగా ఉంటున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయం అంటూ చీరలు మాత్రమే
కట్టుకోమంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకోవటానికి, చదువుకోవటానికి బస్సు
లలో తిరిగేవాళ్ళకి కష్టం. కనుక చుడీదార్లు, సరిగా ఉండే పాంటులు, టి షర్టులు
వేసుకుంటే ఎవరికీ అసభ్యంగా కనపడరు. మన వస్త్రధారణ, మన నడవడిక చూస్తే
ఎదుటివారు మర్యాద ఇచ్చేటట్లు ఉండాలి కాని రెచ్చగొట్టి మనల్ని అల్లరి
చేసేలా ఉండకూడదు. అరాచకాలు, అత్యాచారాలు పెరిగాయంటే మన ప్రవర్తన ఎలా ఉందో
ఒకసారి ఆలోచించుకోవాలి, తల ఎత్తుకుని పబ్లిక్ పార్క్ లలో నడిచే పరిస్థితి
ఇప్పుడు ఎక్కడైనా ఉందా? నాలుగు గోడల మధ్య జరిగే వన్నీ అక్కడే
జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరిది తప్పు అనడం లేదు తప్పు ఎక్కడ ఉందో
గమనించండి అంటున్నా... చూసే కళ్ళల్లోనా లేక రెచ్చగొట్టే మన వేషధారణలోనా...? ఫ్యాషన్ ఫ్ఫ్యాషన్ అని మోడ్రన్ కల్చర్ అని వాటి దారిన కొంత మంది వెళ్తే భారతీయ కల్చర్ నచ్చి ఆ దారిలో వెళ్ళె వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. 
ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ? ! 
@ NET @

                                                           Ur's.......Rasool