28, నవంబర్ 2011, సోమవారం

ఎందుకు ఎందుకు ఈ ద్వేషం ఎందుకు...!!!


ఎందుకు ఎందుకు ఈ ద్వేషం ఎందుకు...!!!
ఆడ  మగ అని తేడాలు ఎన్నాళ్ళు మన ఈ జీవితం, ఎన్నాళ్ళు మనం శాశ్వతం....
వుండేది కొన్నాళ్ళే, ఆ కొన్నేళ్ళు ద్వేషంతో నిండాల...
ద్వేషం లో ఏముంది,
పగతో ఏ పని అవుతుంది...
ప్రేమ చూపించ లేరా చిరునవ్వు అందించ లేరా ...
అంటరానితనం ఎందుకు అడ్డుగోడలు ఎందుకు..
అందత్వంలో జీవించే మనుషులు మనుషులేనా....
కళ్ళకు గంతలు తియ్యండి, మీ హృదయాలను ప్రేమతో నింపండి....
కులం మతం మనం పెట్టుకున్నవే, అందరి రక్తం ఒక్కటే , మరి ఈ విబెధలేందుకు...
ద్వేషంతో ఏమిసాదిస్తావు మరణంతప్ప....
బ్రతికి వుంది పదిమంది మెప్పుపొందు...
చివరికి మిగిలేది మన్నే, ఆమన్నులో కలిసేతాప్పుదయినా  నీ కోసం కంటతడి పెట్టి, ఆ మన్ను ఫై రెండు కన్నీటి చుక్కలు అయిన రాల్చేల చూడు,
అదే జీవితం....!!!!!
నలుగురితో వుండు నలుగురి కోసం బ్రతుకు !!!!!!

25, నవంబర్ 2011, శుక్రవారం

పని చేసి చాలా అలిసిపోయారా


పని చేసి చాలా అలిసిపోయారా, జీవితం చాలా బిజీ అయిపోయిందా, చిన్న చిన్న సంతోషాలను ఎలా పొందాలో అర్థం కావడం లేదా.అయితే ఇవి చూడండి.

ఒక మంచి, నీకిష్టమైన స్నేహితునికి తనకి తెలియకుండా తన పుట్టిన రోజు పండగను ఏర్పాటు చేసి, ఒక మంచి బహుమతిని ఇవ్వండి.

వర్షంలో హాయిగా తడవండి, లేదా వర్షం తగ్గాక పార్క్ కి వెళ్ళి పచ్చ గడ్డి మీద నడవండి,కాసేపు కూర్చోని అక్కడి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆనందించండి.
ఎఫ్.ఎం.వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ కి ఇష్టమైన పాటని వేయమని అడగండి.ఆ టైం లో మీ ఫ్రెండ్ ని రేడియో వినేలా చూడండి.

అమ్మ నాన్నలకి మంచి బహుమతి ఇవ్వండి వాళ్ళు అశ్చర్యపడేలా.
పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి.
వృధ్ధాశ్రమానికో, అనాధశరణాలయానికో వెళ్ళండి. అక్కడి వాళ్ళను ప్రేమతో పలకరించండి.

మీరే స్వయంగా ఏదైన వండి, అందరికీ వడ్డించండి.
ఫసిపిల్లలని ఎత్తుకోండి.వాళ్ళని నవ్వించండి.ఆ పాల బుగ్గలను చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోండి.

బాల్య మిత్రులకు ఫోన్స్ చేయండి, మెయిల్స్ చేయండి.చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

ఏదైన కొత్త సినిమా పాట కాని, దేవుడి పాట కాని నేర్చుకోండి.
నెలకి ఒక్కసారైనా మనసుకి నచ్చిన స్నేహితులని కలవండి.పిచ్చాపాటి మాట్లాడుకోండి.అందరు కలిసి సినిమాకైనా, ఒక మంచి ప్రదేశానికైనా వెళ్ళండి. లేదా ఇంట్లో నైనా కాసేపు కాలాన్ని ఎంజాయ్ చేయండి అందరికి ఆ నెలలో జరిగిన అనుభవాలాను చెబుతూ.ఆ అనందమే వేరుగా ఉంటుందండి.
                                                           Ur's.......Rasool

23, నవంబర్ 2011, బుధవారం

మిత్రమా అని ఎందుకంటారొ తెలుసా, , ,


మిత్రమా అని ఎందుకంటారొ తెలుసా, , ,
హాయ్ అనే పరిచయంతో మొదలై . . . .
కొన్ని మాటలతో సాగి . . .  . అన్ని చెప్పుకుంటూ ఆఖరికి ఒకరిపై మరొకరికి నమ్మకం
కుదిరినప్పుడే ఆ స్నేహం అనేది అంతులేని శిఖరాలకు చేరుతుంది. . .
"" ప్రేమ అనేది చూసే అందం, వాళ్ళ
మనస్తత్వం, వాళ్ల నడవడిక, ప్రవర్తన ఇలా మనలోని కొన్ని లక్షణాలు ఎదుటి
వారికి నచ్చి పుడుతుంది . . కాని స్నేహం ఇవేం అవసరం లేకుండా . . .
ఒకసారి కలుస్తాం హాయ్ అంటాం . .
ఇంకోసారి కలుస్తాం . . ఆ రెండో సారికే నువ్వు మిత్రుడు అయిపోయి ఉంటావు . .
నువ్వు అనుకోక పోయిన ఎదుటి వాడు నిన్ను తన మిత్రుడుగాస్వీక రిస్తాడు . .
ఆ తర్వాత నీ గురించి తెలుసుకొని ఆ స్నేహం బంధాన్ని గట్టితరం గా చేసుకుంటారు . . ""
భగవంతుడు
కష్టాలు , బాధలు చెప్పుకోవడానికి ముందుగా మనకు రక్త సంబంధీకులైన అమ్మ,
నాన్న,అన్న,అక్క, తమ్ముడు,చెల్లెలు,బంధువులు ఇలా అందరినీ ఇచ్చాడు. . .
కానీ కొందరు మాత్రమే తమ కష్టాలు
వాళ్ళతో పంచుకుంటూ మిగితావాళ్ళు వారితో పంచుకోలే , ఇంకెవరితో  పంచుకోవాలో
తెలియక సతమతమవుతూ ఉండటం ఒకరోజు ఆ దేవుడు చూశాడు . .
అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ నీడలా
వెన్నంటే ఉండే ఒక మిత్ర బంధాన్ని భూమిపైకి పంపాడు . . . ఆ మిత్ర బంధం అనేది
పాకుతూ వస్తుంది . .పాత రోజుల్లో అబ్బాయి అబ్బాయి, అమ్మాయికి అమ్మాయి
మాత్రమే మిత్రుడు గా ఉండేవాడు . .అలాగే ఉండాలని ఒక నిబంధన ఉండేది . . కానీ
మారుతున్న సమాజానికి అనుగుణంగా మనిషి మారడం మొదలు పెట్టాడు అలా . . .
ఇప్పుడున్న కాలంలో పాత కాలానికి విరుద్దంగా స్నేహం కొనసాగుతుంది . . . . అంతా
మామూలై పోయింది . .
కష్టాలు , బాధలు, ఇలా ఏం కొత్త పని చేసినా వాళ్లతో పంచుకోవడం మామూలుగా జరుగుతుంది . . కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది
అమ్మాయి
అబ్బాయి స్నేహంలో చాలా లొసుగులు న్నాయి. వీరి స్నేహంలో చాలా జాగ్రత్తలు
అవసరం కూడా . . .ఒకరు గట్టి మనస్తత్వం కలవారు ఉంటే ఇంకోరు సున్నితమైన
మనస్తత్వం కలవారు ఉంటారు . .
ఏ చిన్న మాట  పడినా బాధపడి అనుక్షణం
అలా ఎందుకు అన్నారో అని ఏడ్చేవారున్నారు  . . నువ్వు ఎన్ని మాటలు అన్నా
విని వదిలేసే వాళ్ళున్నారు . . ఇదంతా మాకు తెలుసునోయ్ అంటే నేను ఒప్పుకోను .
. ఎందుకంటే చాలా మంది మన మిత్రుడు చెప్పే విషయానికి ఎలా రియాక్ట్ అవ్ తాడొ
ఏమీ ఆలోచించకుండా . . చాలా మాటలు అనేస్తుంటారు . .తర్వాతా క్షమించమని
అడగడాలు ఇవన్నీ మామూలే కాని అవన్నీ లేకుండా స్వచ్చమైనా స్నేహం కోసం
ప్రయత్నించండి . . ఒక్కసారి ఆలోచించండి మనం ఏ విషయంలో ఏం చెప్తున్నామో అని .
. """" మన నోట్లో నుండి ఒక మాట బయటికి వచిందంటే దాని వలన కలిగే అన్ని
దుష్పరిణామాలకు నువ్వే కారణం అవుతావని """"  . .
ఇంకో విషయం మైత్రిలో అన్ని
మాట్లాడుకోవడం సహజం  . . అలా ఉండటం వల్ల కొన్ని పర్సనల్ విషయాలు కూడా
అడుగుతుంటారు . . దానికి మీరు చెప్ప దలచుకుంటే చెప్పండి లేకుంటే వారించండి .
.అంతే కాని మైత్రిని మాత్రం వదులు కోవద్దు . .  అలాంటి మిత్రుడు మీకు
జీవితంలో దొరక్క పోవచ్చు . . "" ఏదో మిత్రుడు అని క్లోజ్ గా
మాట్లాడుతున్నారనే ఏదైనా అడుగుతారు అందుకనే కోప్పడాలా . . లేదు మిత్రమా
నేను చెప్పలేను లేక ఇవ్వలేను అలా అడగకు నాకు నచ్చదు అని వారిస్తే ఏమైనా
అంటామా అనం కదా ((అప్పటికీ కూడా అడిగితే అప్పుడు మీకు తోచింది చేయండి)). .
. అలా కాకుండా బాధ పడి పోతే నీ కన్నా ఎక్కువగా బాధ పడె మేము ఇక్కడ ఉన్నాం .
(((అమ్మాయి అబ్బాయి స్నేహం నేను ఒకటి బాగా గమనించాను అమ్మాయి అబ్బాయిని అన్ని విషయాలు అడగొచ్చు కాని అబ్బాయి మాత్రం నోరు మెదప కుండా అన్నిటికీ సమాధానం చెప్తాడు . .
కాని తను ఏదైనా చెప్పి నప్పుడు , అడిగినప్పుడు తమనేమో అనుమానిస్తున్నట్లు, అవమానిస్తు భావిస్తున్నారు అలా ఎందుకు అనుకుంటారో ఏమో . . . అమ్మాయి అడిగినప్పుడు అబ్బాయి చెప్పినప్పుడు ఇదే విధంగా అబ్బాయి అడిగినప్పుడూ అమ్మాయి చెప్పడానికి ఏమౌతుంది . . అలా చెప్పలేక పోతే మీరు చేస్తుంది . . స్నేహమా లేక టైం పాస్ ఆ . . అంతగా చెప్పలేనిది అయితే ఇది చెప్పలేను చెప్పవలసిన టైం వచినప్పుడు చెప్తాను అని చెప్పండి . . ఏంటో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు . . ఎప్పుడూ మారతారో ఏంటో ??? ఒక పాత సామెత ఉంది అనుమానం ముందు పుట్టి ఆడపిల్ల వెనక పుట్టిందంట . . . చూడండి ఇది అందరికీ వర్తించదు . . . )))
ఒక సారి ఆలోచించండీ . .  .
ఏమైనా తప్పు చెప్పి ఉంటే క్షమించండి . .

నేను రాసే


నేను రాసే చాలా స్రాప్స్ కళ్ళ ఎదుట జరిగిన నిజమైన సంఘటన చూశాకో లేక అనుభవం అయ్యాకనో లేక ఎవరో ఒకరు మన మిత్రులు నాకు చెప్పకనో ,ఎక్కడైనా చదివి నచ్చి రాస్తుంటాను... అవి కొందరికి నచుతే మరికొందరికి జాగ్రత్తలు చెప్తుంటాయి. మరి కొందరికీ కోపం తెప్పిస్తుంటాయి. ఎనీ వే నచిన వారికి నన్ను మెచ్చుకున్న వారికి నా ధన్యవాదాలు. కోపం వచిన వారికి నా క్షమాపణలు కొత్తగా ఉంది కదా నా స్రాప్ హ హ హ .. ఏదో ఇలా రాయాలని పించింది రాస్తున్నాను.. నిన్న అదేనండి... ఆదివారం అందరికీ జాలీ జాలీ డే కానీ నాకు వెరీ బోరింగ్ డే... ఆదివారం వస్తే చాలు ఎవరూ ఉండరు ఒక్కన్నే ఉండాలి .. అందుకే నా లైఫ్ లో సండే అంటే బోరింగ్ డే ... అన్నట్లు మీకు బోర్ కొడుతుందా అయితే ఏమాలోచించకుండా వెంటనే చదవడం మానేయండి హ హ ... ఈ రోజు అంటే నిన్నటి ఆదివారం చేసినవన్ని రాయలని రాస్తున్న...కానీ ఒక రెండు రాస్తాను అంతే బోర్ కొట్టనివ్వలేండి ముందుగా ఆదివారం ఉదయం తెల్లవారు జామున 1 కి పడుకున్నాను ఎందుకూ అనకండీ స్పైడర్ మ్యాన్ - 2 గేమ్ ఆడుతూ టైం మర్చిపోయా హి హి హి...ఇక మళ్ళీ ఉదయం 4.30 కే లేచాను కానీ పడుకోరా లేచి ఏం చేసేది ఉంది అని పక్కన్న పడుకున్న నా స్నేహితుడు చెప్పాడు... మళ్ళీ పడుకుని 5 కి లేచి షాప్ నుండి బటకివచ్చాను..బయటికి చూస్తే బాబోయ్ అమ్మాయిలు బిజీ బిజీ ఏదో దొంగను పట్టుకోవడానికి పరుగెత్తినట్లు పరుగెత్తుతున్నారు ..అది నిజమేఅయింది ఎవడో పాల ప్యాకెట్ ఎత్తుకెళ్తున్నాడంటా అందుకే వాడి వెనకాల పరుగెత్తుతున్నారు.. అయినా అదంతా మనకెందుకులే అని ఫ్రెష్ అప్ అయి జాయింగ్ కి బయలు దేరా గ్రౌండ్ కి వచ్చేశా అక్కడ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ .. వాళ్ళు నావెనకే పరుగెత్తుతుంటే హి హి హి దొంగను పట్టుకోవడానికి పరుగెత్తుతున్నట్లు అనిపించింది నాకు ...మ్ మ్ ఇక ఇంటికి వచ్చాను .. ఇంకా ఎవరూ లేయలేదు..వాచ్ పెడ్దామని టివి టేబుల్ దెగ్గరకు వచ్చా అక్క్డడ ఒక స్లిప్ ఉంది "రేయ్ టీ చేయి అని" అది చూసి అందరి కెళ్ళీ చూశా మళ్ళీ అమ్మ పక్కన ఒక స్లిప్ "ఏంట్రా చూస్తున్నావ్ పాలు గూట్లో ఉన్నాయ్ పోయి పెట్టు" అని ఉంది.. స్ స్ స్ ఇక వారం రోజుల నుండి నా కోసం కష్ట పడుతారు ఈ రోజు నేను కష్ట పడదాం అని పోయి టీ చేశా ..బానే ఉంది లేండి..ఇక అందరూ లేచారు.ఇక తర్వాతది వద్దులేండి సోదిగా ఉంటది అంటే ఇది కూడా సోదెలేండి..ఇంత సేపు చదివి నందుకు థ్యాంక్స్.అన్నట్లు మర్చిపోయాను సాయంత్రం "ఓ మై ఫ్రెండ్ " మూవీ చూశాను. అందులో ఒక డైలాగ్ నచింది మీతో షేర్ చేసుకుందామని రాస్తున్నాను.. "ఒక ఆడ మగ మధ్య స్నేహాన్ని ఎవరూ నమ్మరూ.." "ఏ స్నేహితుల మధ్య అయిన ప్రేమ ఉంటుంది." "ఏ ప్రేమికుల మధ్య అయిన స్నేహం ఉంటుంది." "ఏ రిలేషన్ షిప్ లో అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఉండాల్సింది ప్రేమ.

" "ఏమీ ఆశించని ప్రేమ పేరే స్నేహం.." ఒక అమ్మాయి అబ్బాయి వయసొచ్చాక కూడా స్నేహం అని బయట తిరుగుతుంటే చుట్టూ ఉండేవాళ్ళు ఎవ్వరూ నమ్మరు.. అలాగే అన్నచెల్లెలు పక్క పక్కన నిలబడి పోతుంటే వంద మంది వంద రకాలుగా అనుమానించే సమాజంలో బతుకుతున్నాం మనం.. నిజమే కానీ వంద మంది వంద రకాలుగా అంటున్నారని అన్నచెల్లెల్ల అనుబంధాన్ని మార్చలేరు కదా. అన్నచెల్లి, తల్లికొడుకు,తండ్రికూతురు ఇవన్నీ రిలేషన్ పిష్ ను స్వచ్చమైనవిగా చూసే సొసైటి ఒక అమ్మాయి అబ్బాయి స్నేహాన్ని మాత్రం ఎందుకలా చూడలేక పోతున్నారు ??


ప్రేమంటే


ప్రేమంటే  Cinema, Restaurant, Park అంతేనా ....
జీవితం లో ఎవరు  కూడా.....పార్టనర్ ని వదిలి ఇంకొకరిని మల్లి ప్రేమినచాలి అనుకోరు ....
ప్రేమంటే ఎలా ఉన్నా స్వీకరించడం ...... అన్ని చెక్ చేసి చేసేది ప్రేమ కాదు ...... ఏదో తప్పు  వుంది అని వదిలేసినా ప్రేమ కాదు ..... ఒక మనిషిని సర్వస్వం అనుకుంటాము చూడు అది ప్రేమంటే .... తన కోసం ఏదైనా సరే అని అనుకోవడం ప్రేమంటే  ...ఇది నా ఫీలింగ్ ....
ఇప్పుడున్న కాలంలో  ప్రేమంటే ఏమిటి  అంటే  . . . .  Cinema, Restaurant, పార్క్ లే అదీ దేనికోసమో కూడా మీకే తెలుసు !!!  జీవితం మొత్తం  కాదు జస్ట్ 1 నెల  చాలు తర్వాత ఎపుడు వదిలించుకోవాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు . . . .
ముందు ఎలా ఉన్న ప్రేమే అంటారు బట్ తర్వాత అన్ని తెలిసిన తర్వాత అది ప్రేమ కాదు ఆకర్షణ అంటారు .  . . 
ఏదో పెద్ద తప్పు కాదు చిన్న చిన్న పోరాపట్లకే అవి ఇలాంటివి  అంటే కాల్ చేయలేదని మెసేజ్ పంపలేదని  ప్రేమను వదిలేస్తున్నారు . . .   
ఓకే మనిషిని సర్వస్వరం అనుకోవడం చాలా కష్టం దానిని నిరూపించడం చాలా కష్టం . . . . . . మీ ఫీలింగ్స్ నీ నేను తప్పు బట్టడం లేదు ఈ కాలంలో ఇలా చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఊహించినట్లు . . . .

                                                           Ur's.......Rasool

అమ్మ,నాన్న.... నా ప్రియ మిత్రులకు చిరు కానుక



@ తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.....
ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న....
కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ....కాళ్ళ మీద నిలబడే వరకు కనుపాపలా కాపాడుతాడు నాన్న...
రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ....
ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న....
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ....
అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న...
ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ...
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న....
అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ....
జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప....
వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా.....
ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా ... ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దితున్న మా అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక...
అమ్మ , నాన్న ను ప్రేమించండి ... మనస్పూర్తిగా వారు అనుకోని సమయాల్లో మనతో ఏమైనా అన్నా .. మన మంచి గురించే వాళ్ల దృష్టిలో ఎంత ఎదిగిన మనం చిన్న వాళ్లమే ... ఎప్పుడూ .. వాళ్లను విడిచి దూరంగా వెళ్ళకండి  ...
ప్రేమించండి .. అవధులు లేకుండా ,,,, మీరు పెద్దగా సంపాదించి ఇవ్వకపోయినా .. ప్రేమగా వాళ్లతో ఉంటే చాలు ..
అమ్మ నాన్నను ప్రేమించండి ... అందులో దొరికే ఆనందం ఏమరేక్కడా దొరకదు . . . అమ్మానాన్నలు మనపై చుపెప్రేమకు సాటిగా ఎవరు ప్రేమను పంచలేరు . . .
బయట దొరికే అద్దె ప్రేమలన్న అమూల్యమైనది తల్లిదండ్రుల ప్రేమ . . .@
                                                           Ur's.......Rasool

నేను నిన్ను ప్రేమిస్తున్నాను... అని చెప్పడం

నేను నిన్ను ప్రేమిస్తున్నాను...  అని చెప్పడం నేటికాలంలో ఓ ఫ్యాషన్ అయిపోయింది.

ప్రేమంటే ఏంటి...?  ప్రేమంటే ఇదేనా ... ఇంకేదోనా....?
నాకెందుకో చాలా సార్లు ఈ ప్రేమ గురించి రాద్దమనుకున్నపుడల్లా ఇంతకి ప్రేమంటే ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది...
నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఇదే ప్రేమ అని సరైన నిర్వచనం ఇచ్చిన వారు లేరేమో...
ఎందుకంటే వారి దృష్టిలో  ప్రేమ కి నిర్వచనం అదేనేమో
ఈ కాలంలో కొంత మంది యువత ప్రేమ కు చెప్పే నిర్వచనం చాలా సింపుల్, "ప్రేమంటే... ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ 'తోడు' కోరుకోవడం" అంతే. అలాగని అందరూ అలా ఉన్నారని కాదు.
ప్రేమ! యువత నోటివెంట అలవోకగా కదలాడుతున్న మంత్రం. దీన్నే నిత్యం జపిస్తూ, ఆ నామస్మరణలో మునిగితేలుతూ తమ జీవితాలను ఫణంగా పెడుతున్న అమాయక యువతులెందరో! భవిష్యత్తుపై దృష్టిపెట్టి, కెరియర్‌ను సీరియస్‌గా తీసుకుని, చదువుపై ధ్యాస పెట్టాల్సిన వీరంతా తెలిసీ తెలియని మత్తులో కొట్టుకుపోతున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టే యువతులకు అంతా కొత్తగా వుంటుంది. అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం వుంటుంది. దీన్నే ఆసరాగా చేసుకుంటున్నారు అబ్బాయిలు. ప్రేమ పేరుచెప్పి వలలో వేసుకుంటున్నారు. సినిమాలు, షికార్లంటూ కొత్తలోకాన్ని పరిచయం చేస్తున్నారు. త్వరలో పెళ్లిచేసుకుంటాం కదాని అడుగు ముందుకేస్తున్నారు. అది తప్పటడుగని తెలిసేసరికి ఆ అమ్మాయిలు సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు.
యువత నిజ సమాజంలో కోరికను తీర్చుకునేందుకు
ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్నారు. ప్రేమిస్తున్నానని అమ్మాయిల వెంటపడి వేధించటం, కాదంటే తిరస్కారాన్ని భరించలేక వారిపై యాసిడ్‌ పోయటం, కత్తులు, బ్లేడ్లతో దాడి చేసి వారి ప్రాణాలకు ముప్పుకలిగించే పైశాచిక ప్రవృత్తి ఇటీవల కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. కోరుకున్న వ్యక్తిని, రెండవ వ్యక్తి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా సొంతం చేసు కోవాలనుకునే రాక్షస ప్రవృత్తి అమాయక యువతుల జీవితాలతో చెలగాటానికి దారితీస్తున్నది. ఫలితం ఇటు అమ్మాయిల జీవితాలతో పాటు, అబ్బాయిల జీవితాలు కూడా పూర్తిగా అంధకారంలోకి నెట్టబడతున్నాయి. ఇదీ ప్రస్తుతం యువత అలవరిస్తున్న తీరు.
ప్రేమకు
    కొత్త నిర్వచనాలు - ప్రేమిస్తే ప్రాణమిస్తా - ప్రేమించకుంటే - ప్రాణం తీస్తా! - అవునంటే గుండెలో చోటిస్తా - కాదంటే గొంతు కోస్తా! - అవసరమైతే - ప్రేమికురాల్ని చంపైనా - ప్రేమను బ్రతికించుకుంటా! -  ప్రేమ త్యాగం చేస్తుంది - అది నిన్నటి మాట - ప్రేమ పగను పెంచుతుంది - ఇది నేటి బాట! - ప్రేమంటే ఆనందించాలో... - భయపడి చావాలో... - అర్థం కాని రోజులొచ్చాయ్‌!!



                                                           Ur's.......Rasool

ఆలోచనలేని ఆవేశం


ఆలోచనలేని  ఆవేశం..ఉప్పొంగే ఉడుకు రక్తం.. ఎగసి పడే ఉత్సాహం..
కాని దాన్ని ఏం చేసుకోవాలో  తెలిదు ..
స్నేహం..హాయ్ లు ,,బై లు.. సినిమాలు..షికార్లు..మాటలు..ముచ్చట్లు..కోపాలు, తాపాలు..  ప్రేమలు..అలకలు..కులుకులు..కిస్సులు..హగ్గులు...
చదువు తక్కువ...టైం పాస్ ఎక్కువ..
బుక్కులు ముట్టరు ..పేస్ బుక్కు  మాత్రం  వదలరు.
అన్ని అందుబాటులోనే.. కాని ఏ ఒక్కటీ అందుకోరు.
చదువుకి తొందర లేదు..ప్రేమకి మాత్రం ముందరి కొస్తారు.
అన్ని ఎదురుగా ఉన్నా..ఏదో పెద్ద టెన్షన్..
నైల్ తో పోయేదానికి ..నైఫ్ దాకా తెస్తారు..
గుండెలకి గాలికి బదుకు పొగ కావలి..
పాలు తాగే వయసులో బీరు కావలి.. 
పట్టుమని పది మార్కులు రాకున్నా  పొగరు మాత్రం పుట్టెడు.
ఎం చేయాలో  తెలిదు కాని ఏదైనా చేసేయగలమని బ్రమ
ఇదంతా  ఉండొద్దని కాదు.. ఇదే ఉంటె బ్రతుకు బొగ్గే..

                                                           Ur's.......Rasool

నేటి యువత పయనం ఎటు వైపు?


సినిమాల వైపా? మాదక ద్రవ్యాలవైపా? ప్రేమ వైపా?
లేక సమాజ సేవ వైపా? ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశీలిస్తే సమాధానం తెలిసిపోతుంది.
సినిమాలు చూడటం తప్పుకాదు ఆ సినిమాలోని మంచిని తీసుకొని చెడును వదిలేయగలగాలి .
మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది. మరి అలాంటివి అవసరమా?
ఇక ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి వారు మనల్ని ప్రేమించాలని ఏమి లేదు కదా. మరి ఈ విషయాన్నీ ఆలోచించకుండా మనం చావడమో లేక ఎదుటి వారిని చంపడమో ఎంతవరకు సమంజసం? ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం తర్వాత తిరిగి తల్లిదండ్రులపై కేసులు పెట్టడం ఎంతవరకు సరి ఐనది?అల చేస్తే కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకంటూ సమాజంలో ఒక గుర్తింపునిచ్చిన వారి హృదయాలు ఎంత క్షోభిస్తాయి? ముదిమి వయసులో మన చేయూతనందుకొని శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకొనే వారి కల నెరవేరుతుందా? ఆలోచించండి
ఇక సమాజ సేవ విషయానికి వద్దాం. సమాజసేవ అంటే ఏదో దేశాన్ని ఉద్ధరించేయడం కాదు మన వంతుగా ఎదుటి వారి హక్కులను కాలరాయకుండా ఉండటం. మనహక్కులు ఎదుటి వారికి భాద్యతలు అలాగే ఎదుటి వారి హక్కులు మనకు భాద్యతలు.
మనం ఏ విధంగా మన హక్కులను అనుభవించాలి అని అనుకుంటున్నామో ఎదుటి వారు కూడా అలానే ఆలోచిస్తారు.
మరి ఇది సమాజ సేవ కాదంటారా?
ఆలోచించండి, యువత తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే సమ సమాజాన్నిస్థాపించవచ్చు కాబట్టి మేలుకో యువతా మేలుకో.

గుర్తుకురారా? ప్రేమ మత్తులో??



న్నేళ్ళుగా  కని,పెంచిన  తల్లి తండ్రులు గుర్తుకురారా?
చిన్ననాటి నుంచి  మన అడుగులో అడుగైన చిన్నారి  స్నేహితులు  గుర్తుకురారా?
స్నేహానికి నిజమైన  నిర్వచనం తెలిపేలా మెలిగే కళాశాల,కాలేజీ  స్నేహితులు  గుర్తుకురారా?
తోబుట్టువులు,  తోటి బంధువులు అసలే గుర్తుకురారా?

ఇంత మందిఇన్ని సంవత్సరాలు  మార్చలేని/ప్రభావం చూపలేని  నీ  జీవన  విధానాన్ని, జీవితాన్ని... … …మనతో ఉంటుందో లేదో  తెలియని  కొన్ని  రోజుల  ఒక  అమ్మాయి  లేక  అబ్బాయి  ప్రేమ  అనే  పరిచయం  ప్రభావం  చూపుతోంది,   జ్ఞాపకాల నుంచి బయటకు రాలేను అంటూ..జీవితాన్ని చీకటి మయం చేసుకుంటూ వెళ్తున్నావ్ అంటే  నువ్వు నమ్మగలవా?  .... నమ్మగలవా ఇది నీ అనుమతి లేకుండా జరగడంలేదు  అంటే ??  ఉంటుందా ఇంతకన్నా  దౌర్భాగ్యం?? …..ఇదేనా  నీపై  నీకు  గల  నియంత్రణ?
కాదా  ఇది  నువ్వు నీ  చేతులారా  చేసుకుంటున్నది, నీవల్ల   కావటం లేదు అని  నిన్ను  నువ్వు  కప్పిపుచ్చుకుంటూ/క్షమించుకుంటూ/మోసగిన్చుకుంటూ  నీ  జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నది...... ?
ఇప్పటిదాకా  నువ్వు  అనుభవించిన  కష్ట, నష్టాల అనుభవాల  కన్నా  ఎక్కువ    కొన్ని  రోజుల  పరిచయం? ……
కాదా  నీకై  నువ్వే  తనకి ఇచ్చుకుంటున్న  ప్రాముక్యత ……తెలియడం  లేదా  లేక .తెలుసుకోవాలని లేదా?…
వదిలేయ్  ఆ  దుఖభరితమైన  ఆలోచనలను,
తుడిచెయ్  నీలోని  పనికిమాలిన  ఆలోచనలను,
చేరిపేయ్ నీ మనసులోని తాత్కాలిక సుఖాలను....
గుర్తుంచుకో నీ తల్లి  తండ్రులను, నీ ప్రతి అడుగులో నీకు  సాయం చేసిన చేతులను వారి ఆశలను, ఆశయాలను,  నీ జీవిత లక్ష్యాన్ని …
తెలుసుకో  ఏది   నీతో కడ దాక  రాదని,
మేలుకో ప్రేమ  అనే  మత్తులోంచి,
నడుచుకో  నీ  జీవిత  లక్ష్యాలవైపుగా,
మార్చుకో  ప్రస్తుత  నీ  మానసిక  స్వబావాన్ని
చేరుకో అంతులేని ఆనంద తీరాలను, అనుభవించు జీవితంలోని ప్రతి క్షణాన్ని......
నువ్వు తప్ప , నీ సహకారంతో తప్ప నిన్ను మార్చే శక్తీ, వ్యక్తి, వైద్యం సృష్టిలో లేదు.... నీకు నువ్వే అన్ని తెలుసుకో ..
....కష్టమైన, సుఖమైన,బాధైనా, సంతోషమైన మరి ఏదైనా....కారణం నువ్వే....మందు నువ్వే....తెలుసుకో నిజాన్ని మార్చుకో నీ జీవితాన్ని....

ఇవన్నీ నిజాలే తెలుసా మీకు..?


1) మనకు ఎందరో పరిచయం అవుతుంటారు అందులో కొందరే మంచి స్నేహితులవుతారు మనతో మంచి చెడు పంచుకుంటూ మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా..స్నేహం విలువ తెలీనివాళ్ళకు దూరంగా ఉండు

2)."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...

3).'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

4)."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

5)."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

6)."నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట"...

7)."ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

8)."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు....!!!!!

9) ప్రేమించి మోసం చేశారని భాదపడకు ఆర్హత వాళ్ళు కోల్పోయారు అని తెలుసుకో అదే నీప్రేమలో నిజాయితీ...

10) ప్రేమించానంటూ చెప్పి వేరే కారణాలతో తనకిష్టం లేదనే అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త..అలాంటి వారిని డీప్ గా లవ్ చేయకు మోసపోతావు
                                                           Ur's.......Rasool

కొన్ని మంచి అమృత వాక్యాలు . . . .

మనం చదవడమే నేర్చుకున్నాం కాని ఆలోచించడానికి శిక్షణను పొందలేదు.
--సర్వేపల్లి రాధాకృష్ణ
వంద ఉద్బోదల కన్నా ఒక అనుభవం గొప్పది
--వివేకానంద
ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు
--రమణ మహర్షి
నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు
--కాజ చైతన్య
ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న
--మదర్ థెరిస్సా
జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
--ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్
ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
--వివేకానంద
తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
--మాతా అమృతానందమయి

జీవితమే ఒక ఆర్కుట్


 అంతర్జాలంలో గంటలు గంటలు గడిపే వాళ్ళకి సుపరిచితమైన పేరు "ఆర్కుట్". చిన్నప్పటి స్నేహితులు నుండి బహు దూరపు బందువుల దాకా అందరినీ కలిపే వేదిక. ఇప్పుడైతే అందరు మొహంపుస్తకం (Facebook) ఎక్కువగా వాడుతున్నారు కాని., నిన్న మొన్నటి దాకా ఆర్కుట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

దూరం ఐన స్నేహితులనే కాకుండా, కొత్త కొత్త స్నేహాలను కూడా పరిచయం చేసింది ఆర్కుట్. ఉదాహరణకు "ఆర్కుట్ లోని పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ ఇంకేదోగా మారి, పిచ్చయ(19), పుల్లమ(18) అనే ప్రేమజంట, పెద్దలను ఎదిరించి, ఫలానా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు(శాస్త్రోక్తంగా)" ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు దినపత్రికలలో చూసే ఉంటారు. ఇప్పుడు ఆర్కుట్ గురించి ఇంత పెద్ద మొత్తంలో రచ్చ ఎందుకు చేస్తున్నాను అంటే, ఆర్కుట్ మీద నేను ఒక పాట రాసానన్నమాట!!!! దానిని ప్రత్యేకంగా మీకోసం శీర్షికలో........
అనట్టు చెప్పటం మర్చిపోయా, పాట "కొండ వీటి దొంగ" చిత్రంలో పాటకి దగ్గరగా ఉంటుంది.

పల్లవి ||
జీవితమే ఒక ఆర్కుట్, సాహసమే ఒక స్క్రాప్ బుక్
బాగా నెట్వర్క్ ఉన్నన్నాళ్ళు ఉండవు మనకే కష్టాలూ
చుట్టాలైన, స్నేహితులైనా అంతా నా వాళ్ళు
ఎవరూ దాగలేరు, యాడ్ కాక ఉండలేరు.
                                                 ||జీవితమే||
చరణం||
జాడే లేని ఎదవల కోసం, సెర్చ్ బటన్ నే యూస్ చేస్తా
ప్రతి ప్రొఫైల్ ను వెతికి వెతికి జాడేంటోనే పట్టేస్తా
ఫ్రెండ్స్ ఐన, నాన్ ఫ్రెండ్స్ ఐన, మెసేజ్ చేయక వదలను రా, వదలను రా
                                                 ||జీవితమే||
చరణం||
ఎప్పుడో చూసిన చిత్రంలోని వీడియోని నే యాడ్ చేస్తా
ప్రతి ఆల్బం తెరచి తెరచి కామెంటే నే చేస్తా
యావత్ ప్రపంచం, అయినది కొంచం , అల్లుకోక ఇక ఉండకు రా, ఉండకు రా
                                                 ||జీవితమే||

                                                           Ur's.......Rasool

అపోహ . .

ఇది అబ్బాయిల కోసం ఎక్కువగా చెప్తున్నా . . .సహజంగా అబ్బాయి అబ్బాయితో.... అమ్మాయి అమ్మాయితొ మాట్లాడకంటే దానికి విరుద్దంగా మాట్లాడుకోవడం ఇష్టపడతారు . . అబ్బాయిలు కనిపించిన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం చాలా ఎక్కువ అది సహజం. . అమ్మాయిలు అబ్బాయిల బిహేవియర్ వారి గురించి తెలుసుకొని  పెట్టే వారు అతి తక్కువ. . సరే అదంతా ఎందుకు (( ఒక అబ్బాయిని అమ్మాయి యాడ్ చేసుకున్న వెంటనే ఇద్దరు మాట్లాడు కోవడం సహజం . . . పరిచయం చేసుకున్న తర్వాత మాక్సిమం అమ్మాయిలు అబ్బాయిలను రిమూవ్ చేసేస్తారు వాళ్ళిచ్చే సమాధానాలు మరియు చెప్పే విధానం నచ్చక. .అలాగని మీరు తప్పు చేశారని కాదు మీరు చెప్పే పద్దతి వారికి నచ్చలేదు అంతే . . ప్రపంచంలో వాళ్ళు ఒక్కరే మీకు కరెక్ట్ మిత్రుడు అనుకుంటే ఎలా మీకోసం చాలా మంది ఉంటారు గా వారి కోసం వెతకండి దొరుకుతారు . . అప్పుడు మీరు ఎలా మాట్లాడుడినా నీ వెంటే ఉంటారు కదా. . అలా కాదని రిమూవ్ చేసిన వారిపై ద్వేషం పెంచుకోవడం మంచి పద్దతి కాదు . ఇంకో విషయం ఏమి టంటే పరిచయమైన ప్రతి అమ్మాయి కూడా వెంటనే తన ముఖ చిత్రాన్ని మీకు ఎలా చూపిస్తుంది . . ఆ ఇంగిత జ్నానం లేకుండా ఫోటోస్ , మొబైల్ నెం . అడిగేస్తుంటారు . . మీరు తనకు మంచి మిత్రుడు అని తనకు అనిపిస్తే తనే నీకు అడిగి మరి చూపిస్తుంది . .అంత వరకు ఆగాలి . ఆగలేక పోతే నువ్వు చేసే స్నేహంలో మరక ఉన్నట్లే . . అలాంటి స్నేహాన్ని ఎవరూ కావాలనుకోరు. . . చాలా మందిని గమనించాను యాడ్ చేసుకున్న వెంటనే పొగిడేయడం అన్ని అడిగేయడం చేస్తుంటారు . .(( ఖచితంగా చెపుతున్న ఇలా అడిగిన వారు కేవలం టైం పాస్ కోసమే మంచి స్నేహం కోసం మాత్రం కాదు )))   ఆ ఇంకా ఒకటి మిగిలి ఉంది అమ్మాయి అబ్బాయితో క్లోస్ గా మాట్లాడితే చాలు ఇక అపోహలు తను నన్ను ఇష్ట పడుతున్నదని భ్రమ అబ్బాయిలలో అది మీ మిత్రురాలు  మీపై ఉన్న ప్రియ స్నేహంతొ మీతొ అలా మాట్లాదుతుందని ఎందుకు అనుకోరో ఏంటో . . . .అమ్మాయిలు కూడా కుప్ప చెత్తలుగా ప్రెండ్ రిక్వెస్ట్ లను చూసి మురిసి పోతూ అందరిని ఏక ధాటిగా యాడ్ చేస్తూ పోతుంటారు. . ఎవరు అలాంటి వారు వారి ప్రొపైల్ అండ్ వారి ప్రెండ్ ల, కమ్యునిటీల లిస్ట్ చూస్తే తెలుస్తుంది. సో కాస్త చూసి యాడ్ చేసుకోండి... చేసుకున్న తర్వాత బాధ పడ కూడదు కదా అందుకని . . .చాలా మంది అమ్మాయిలు ఇలాగే బాధ పడుతున్నారు. అందుకే చెప్పాను  . .  ఎవఱా వీడు హిత బోధ చేస్తున్నాడేంటి అని అనుకుంటే అది ఖర్మ . . .

                                                           Ur's.......Rasool

నా జీవితంలో ఒక నిశబ్దపు రోజు నాకు కలిగిన అనుభవం

నా జీవితంలో ఒక నిశబ్దపు రోజు నాకు కలిగిన అనుభవం

ఎప్పుడూ బిజీ బిజీ గా ఉండే నా లైప్ లో ఒక ప్రశాంతమైన రోజు వచింది. చాలా మందికి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. కానీ నాకు కలిగిన  ఆ ప్రశాంతత ఎలా ఉందంటే తట్టుకోలేనంత .
ప్రతి రోజు ఎవరో ఒకరు మిత్రులు  ఆన్ లైన్ లో లేక పోతే మనదెగ్గరికి వచ్చి
ఎలా ఉన్నావ్ . . ఏం చెస్తున్నావ్ . .అలా మాటలు కలుపుతూ వెల్తుంటారు . .కాని నిన్న అలా ఎవరు లేరు సరేలే ఎవరి పనుల్లో వారు ఉంటారు అని అనుకొని షాప్ కి వెళ్ళా ఉదయం  10 ki . . షాప్ లో కూర్చున్న కూర్చున్నాకూర్చునే ఉన్నా ఆదివారం అని నాకు గుర్తులేదు .
కస్టమర్స్ ఎవరు రావట్లేదు . . అప్పుడు గుర్తుకు వచింది . . నాయనా ఈ రోజు ఆదివారం నాయనా. . అని ఒక మాట నెత్తి మీద్ద కొట్టి చెప్పి నట్లు ఉంది అప్పుడు.
సరేలే అని ఫిజిక్స్ చదువుతూ ఉన్నా . . ఇంతలో ఇద్దరు మిత్రులు ఆన్ లైన్ లో వచ్చి కాసేపు నాతో కొట్లాడి వెళ్తున్నా అని కూడా చెప్ప కుండా తమ దారిన వారు వెళ్ళి పోయారు  . అని సహాజమే అనుకొని మళ్ళీ చదవడం మొదలు పెట్టా . . కాసేపు రిలాక్స్ కోసం మళ్ళీ స్నేహితుడితో మాట్లాడి . . టైమ్ మర్చిపోయా మధ్యాహ్నం 2 అయింది ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళి తిని వచ్చేశా . . ఇక అప్పటి నుండి పలకరించేవారే లేక పాయే . . చదివే మూడ్ లేక పాయే . .  ఏం చేయాలో అర్థం కావట్లేదు . . కాపేపు టివి చూశా సిస్టం లో
కాసేపు పాటలు, గేమ్, ఆఖరికి నిద్ర పోవడానికి ట్రై చేశా
మ్ హు రాలా . . .అంతలో పత్రికా విలేఖర్లు వచ్చారు . మా ఊర్లో జరిగిన కొన్ని వార్తలను టైప్ చేసి వాటిని వారి వారి ఈ మెయిల్ లకు పంపించేశా....
వారు వెళ్ళి పోయారు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఒక ముగ్గురు మిత్రులు పలకరించారు
వాళ్ళతో కాసేపు మాట్లాడా . . రాత్రి 8 అయింది . . భోజనానికి వెళ్ళి మళ్ళీ షాపుకు వచ్చా . . మళ్ళీ అదే బోర్ . .బయటికి వెళ్ళి మిత్రున్ని కలిసి రికార్డ్స్ తీసుకొచ్చా అవైనా రాద్దామని . . వాటిని చూస్తే నిద్ర వస్తుంది కాని రాయడానికి మూడ్ రాలా . .రాత్రి 9.30 అయింది . . ఇక ఏం చేయాలా అని ఆలోచించి సినిమా చూశా "ఊసరవెల్లి" ఈ సినిమా చూస్తూ చూస్తూ . . మధ్యలో ఒక న్యూస్ చానల్ చూశా .. నాకు ఒకటి రాయాలని పించింది. . ఒక అమ్మాయిని ప్రేమ కోసమే ఎందుకు వెంట పడాలి ఆ అమ్మాయితో స్నేహం కోసం వెంట పడొచ్చు కదా అని. .
స్నేహం, ప్రేమ రెండు దెగ్గరి దెగ్గరివే ప్రేమ అంటే ప్రేమించే వారి గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ(ఒక్కరి) వారి ధ్యానంలో ఉండి, ఏం చేస్తున్నారో, ఎలా ఉనాడో అని ఎప్పుడూ వారి గురించే ధ్యాస అదే స్నేహం అంటే అన్నింటిని షేర్ చేసుకోవడం ... రెండు విలువైనవే . . కానీ చాలా ప్రేమ కథలు ప్రేమ వరకే ఆగి పోయాయి కానీ పెళ్ళి వరకు పోలేదు . . అలాంటి ప్రేమ  కంటే చిరకాలం మనకు వెన్నంటే ఉండే మన చిరు స్నేహం కోసం వెంట పడితే ఎంత బాగుంటుంది కదా .నాకు తెలిసి ప్రేమ అనేది ఒక ముళ్ళున్న ఒక గులాబి పువ్వు లాంటిది దూరం నుండి చూస్తే బాబోయ్ దాన్ని చేతిలో పట్టుకోవాలి దాని ముద్దాడాలి అని అనిపిస్తుంది కదా ( నాకు అలాగే అనిపిస్తుంది) దాని కున్న ముళ్ళులు కనపడవు. కాని దెగ్గరికి వెళ్ళి చూస్తే . . .ఛా ఛా చూస్తే కాదు పట్టుకొని చూస్తే చేతికి ముళ్ళు గుచ్చు కుంటుంది. .ప్రేమిస్తే చాటు చాటు భయం భయం గా మాట్లాడుకోవాలి . . స్నేహం అనేది ఒక మహా సముద్రం లాంటిది చూడటానికి నచక పోయినా అందులో పడవ నడక సాగిస్తూ పోతుంటే అంతులేని ఆనందం నీ సొంతం అవుతుంది ప్రేమలో ఒకరి కోసం మరొకరు తమ ఇష్టాలను మార్చుకుంటారు కాని స్నేహంలో ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని నడుచుకుంటారు. ఇదంత ఎందుకు చెప్తున్నానో తెలుసా మొన్న స్వాతి అనే అమ్మాయిని
నజీర్ అనే అబ్బాయి తనను ప్రేమించలేదని గొంతు కోసి చంపాడు ఆ తర్వాత తను బతకలేదు . . తనే ఆత్మ హత్య చేసుకున్నాడో లేక కక్షతో చంపారు మనకు తెలియదు. కానీ ప్రేమ అనే పేరు పెట్టుకొని ఇలాంటి అఘాయిత్యాలు చేయడం వల్ల అత్యంత విలువైన తిరిగి రానటు వంటి ప్రాణాన్ని చాలా మంది ప్రేమి కులు,భగ్న ప్రేమికులు, ప్రేమ విఫలైన వారు, ప్రేమించిన వారిని మరిచి పోలేక చని పోతున్నారు. ఇవన్నీ చేసే ముందు ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న గురించి ఆలోచించి చేయండి. ఎవరెన్ని చెప్పినా నాకు తెలిసి నంత వరకు ప్రేమ కన్నా స్నేహమే ముద్దు దీనికి లేదు హద్దు . .సారీ ఎవరినైనా నొప్పిస్తే . . .

                                                           Ur's.......Rasool

నెట్ అడిక్ట్

కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతీ ఇంట్లోనూ ఉంటున్నాయి. చాలామంది వీటిని తమ చదువులకూ, కెరీర్ కీ ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటూ ఉంటే కొంతమంది.. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, ఇతర ఆన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్, టైమ్ పాస్ సైట్లలోనూ గంటల తరబడి స్పెండ్ చేస్తూ ఇంటర్నెట్ బానిసలుగా మారుతున్నారు. సోషల్ నెట్‌వర్మింగ్ వలలో యువతరం ఏకాగ్రత కోల్పోయి చిన్నపిల్లల్లా తయారవుతున్న వైనం సాటి వారితో మాట్లాడడం కూడా రాని శక్తత పనికిమాలిన విషయాల పట్ల పెరుగుతున్న శ్రద్ధ  మనకు ముక్కూ, ముఖం తెలియని వారు, ఇవాళ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏం  చేశారో తెలుసుకునే వారు ఇంట్లో ఇవాళ్లి బ్రేక్‌ఫాస్ట్ కోసం అమ్మ ఎంత కష్టపడుతోందో పట్టించుకోరు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లంటే పడి చచ్చే వారు, అందులో అకౌంట్లు సృష్టించుకుని ఫ్రెండ్స్ నెట్‌వర్క్‌లను పెంచేసుకునే వారు ఇలాగే తయారవుతున్నారట. పైగా వారిలో ఏకాగ్రత లోపాలు పెరగడమే కాక, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూస్తూ మాట్లాడే శక్తి కూడా ఉండడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. ఇంటర్‌నెట్ వాడకానికి అలవాటు పడిన  యువతీయువకుల్లో.. ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ఎన్నో సైట్లలో రిజిస్టరై..ఒకరితో ఒకరు ఆ సైట్ ఆధారంగానే పరిచయం పెంచుకుంటున్నారు. ముఖాముఖీ తెలియకపోయినా, వారితో తమ ఫొటోలు, వీడియోలు, కాప్షన్లను షేర్ చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం వల్ల యువతీయువకుల్లో తమనెవరూ గుర్తించడం లేదన్న దుగ్ధ, గుర్తించాలన్న కాంక్ష పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చిన్నపిల్లలు ఏదో ఒకటి చేసేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు అమ్మకు చూపిస్తుంటారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు అలవాటు పడిన వారి మనస్తత్వం కూడా ఇలాగే తయారవుతుందని పరిశోధకుల అంచనా. అంటే ఈ సైట్లలో కమ్యూనికేషన్‌కు అలవాటు పడిన వారిలో ఆ సైట్లలో సర్క్యులేషన్‌కు మాత్రమే పనికొచ్చే పనులు తప్పితే మరేమీ చేయలేని అశక్తత పెరిగిపోతోందని తెలిసింది. పైగా స్వల్పకాలంలోనే గుర్తింపు
రావాలన్న తపనతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఆశ్రయించడం వలన, సదరు ఎకౌంట్లలో రిజిస్టరయి ఉన్న ఫ్రెండ్స్ వారిని ప్రశంసిస్తూ ఉంటారు. వాటికి అలవాటు పడిపోయిన వారు అదే స్పందన బయట కానరాకపోతే.. ఇబ్బంది పడిపోతున్నారని తామేం చేస్తున్నామో తమ ఫ్రెండ్స్‌కు తెలియాలని ఆయా మెసేజ్‌లు పోస్ట్ చేస్తుంటారు. దీని వలన ప్రజలు నెట్‌లో తప్పితే నిజంగా లేని ప్రపంచంలో బతకడానికి అలవాటు పడిపోతున్నారని నా అభిప్రాయం

                                                           Ur's.......Rasool

అయిదు వ్రేళ్ళు నోట్లోకి పోని..

అయిదు వ్రేళ్ళు నోట్లోకి పోని.. అభాగ్యుడికి అన్నం కోసం ఆకలి...


కాలేజీకి వెళ్ళే అమ్మాయికి... ఆకర్షణ కోసం ఆకలి...
ఎదుగుతున్న కుర్రకారుకు అల్లరి కోసం ఆకలి....
చీరెల కోసం... నగల కోసం... గృహిణుల ఆకలి....
అందే జీతం కంటే... అందని గీతం కోసం...లంచగొండి... ఆకలి.
కోట్ల జనం కళ్ళి గప్పి... విభేదాలు రెచ్చగొట్టి...
దొరకని పదవుల కోసం... అమాయకులను బలిఇచ్చే నాయకుల .....ఆకలి.
భరతమాత నా మాతృభూమి... భారతీయులంతా నా సహోదరులు...
అని రోజూ వల్లె వేసే...నోటితోనే.. నీది కాదు... నాదని తేడాలను సృష్టించే...
అస్ధిమూల పంజరాలు... ఆర్తనావ మందిరాలు...ఏన్నని చూపను...!

ఆకలితో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. దీనిని ఆపే వారు లేరయిరి. ఎప్పటికి పేదల ఆకలి తీరుతుందో ?.
ప్రతి ఒక్కరు కాక పోయిన మనసున్న వారు సహాయం చేయగలుగుతే కచితంగా ఆకలి చావు ఉండక పోవచ్చు... 
Pls Help The Poor People...మీ చేతనైన సహాయం చేయండి మిత్రులారా...

నాకెందుకు దెగ్గరవుతున్నారో ఎందుకు దూరం అవుతున్నారారో ?

నాకెందుకు దెగ్గరవుతున్నారో ఎందుకు దూరం అవుతున్నారారో ?

పలకరించడం....
పరిచయం . . . .
ఆ తర్వాతి స్థానం స్నేహం....
ఎందుకు దెగ్గరవుతారో ఎందుకు దూరం అవుతారో ఒక అంతులేని రహస్యంగా మిగిలిపోయింది....
ఒక వ్యక్తికి దెగ్గరకావడానికి కొన్ని నెలలు, సంవత్సరాల సమయం పడితే... అదే వ్యక్తి ఏదో ఒక్క చిన్న కారణాన్ని అడ్డుపెట్టుకొని దూరం కావడానికి కొన్ని క్షణాలు కూడా పట్టడం లేదే...
ఏమిటి ఇది ?? ఇది ఇలాగే కొనసాగుతూ రావాలా దీన్ని ఎవరూ ఆపలేరా ??
ఒకప్పుడు నువ్వు చాలా మంచివాడు అన్న నోటితోనే నువ్వు మంచివాడివి కావు అన్న మాట విన్నా ఆ హృదయం ఎలా తట్టుకోగలుగు తుంది.... ఎవరూ ఆలోచించరా ??
ఒకరికి ఫీలింగ్స్ ఉండవు ఏది వస్తే అది చెప్పేయడమెనా ... అవతల వ్యక్తి మనోభావాలను అర్థం చేసుకోలేరా..
చెప్పే ప్రతి మాటకు అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారో ఆలోచించరా... ఇదేనా స్నేహం అంటే .. . . పుస్తకాల్లో రాసిన రాతలేనా స్నేహం అంటే..
స్నేహం అంటే స్నేహితుని కోసం ప్రాణం ఇవ్వాల్సి వచినా ఇవ్వాలి అని ఎక్కడో చదివాను...
ఒకరి బాధలు, సంతోషాలు పంచుకోవాలని
తన వెన్నంటే ఉండాలని
ఇలా చాలా చదివాను .. . . అవన్నీ పుస్తకాలకే పరిమితమా...నిజ జీవితంలో అవి కుదరవా...

ఉదయం లేచినప్పుడు ముందుగా మన నోటి నుండి వచ్చే కమ్మనైన మాట అమ్మ

మనం అభిమన్యులం కాదు, అర్జునులం కాదు, కుభేరులం అంతకన్నా కాదు... ప్రజలందరిలో సామాన్యులం మనం. దేవుడుకష్టాలను ఇస్తాడు, కష్టాలను తీర్చడానికి మానవ రూపంలో సాయము చేస్తాడు. మానవ సాయంలో మనం ఒకరంఅవ్వాలనే ఉద్దేశ్యంతో నేను రాస్తున్నాను నా ఈ ఆరు గంటల స్రాప్
మనబిజీబిజీ, గజిగజి జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి, రాత్రి పడుకునే వరకు ఆనాధ పిల్లలను, వృద్ధులను, వికలాంగులను, విద్యాగంధానికి దూరమైన దురదృష్టవంతులను, సాయం కోసం ఎదురు చూసే వారిని చూస్తూ వుంటాం. క్షణం మన మదిలో వారికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. కాని అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయగానేమన ఆలోచనలు వెనకబడిపోతాయి లేదా ఏవో అనివార్య కారాణాల వలన చేయలేము. తరువాత ఏదో సందర్భంలో ఆలోచన వచ్చినపుడు వారికి ఏదైనా చేయాలి అనుకున్నాం, ఏమి చేయలేదు, ఏదో రకంగా సాయపడాలి, కాని ఏమిచేయాలి! మన ఒక్కరి వల్ల అవుతుందా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. కానీ ఆ ఆలోచన అంత వరకే ఆపేస్తారు అలా ఆపకూడదనే నేను నా స్రాప్ ద్వారా మీకు చెప్పదలచుకున్నాను !! తప్పులుంటే మన్నీంచండి . .
ఉదయం లేచినప్పటి నుండి  ముందుగా మన నోటి వెంట నుండి వచ్చే కమ్మనైన మాట అమ్మ . . . .
ఏ కష్టమైనా వచ్చినా చెప్పుకోవడానికి నాన్న, అన్న, తమ్ముడు,  తోబుట్టువులు అందరు మనకున్నారు . .
కానీ ఎవరూ లేని అనాథ పిల్లలు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు . . . అలాంటి పిల్లలను చూడగానే అయ్యే అని బాధపడటం తప్ప
ఏమీ చేయలేని పరిస్థితి మన అందరిదీ. . .
నేను నిజమే చెప్తున్నాను . . బయట ఎప్పుడైనా మన పనుల కోసం వెళ్ళి నప్పుడు మనకు ముందుగా కనపడేది . .
వీధి బాలలు  . . అన్నా, అక్కా అంటూ దెగ్గరికి వచ్చి ఒక్కరూపాయి ఇవ్వు అన్నా, అక్కా అంటూ చేతులు చాచి అడుగుక్కుంటూ వాళ్లని చూసి మనసు కరిగి పోయి మనదెగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాం . .
ఇక్కడ మనం మన మానవత్వాన్ని చాటు కుంటున్నాం . . అలాంటి వీధి బాలలను (అనాథ పిల్లలను) కొన్ని అనాథాశ్రయాలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నాయి . . అలాంటి అనాథాశ్రయంలో పెరిగిన పిల్లల పోషణకు , కనీస సౌఖర్యాలకు అవసరమైన డబ్బులు ప్రభుత్వం నుండి సరిగా రావడం లేదు . . అయినా కూడా బాధ పడకుండా ఆ అనాథపిల్లల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా వాటిని నిర్వహిస్తునే ఉన్నారు . . ఆ అనాథ పిల్లల్లో చాలా మంది వేసే ఒకే ఒక్క ప్రశ్న మాకెవరున్నారు మా ఆలనా పాలన చూడడానికి ఎవరు ఉన్నారు అని ? ఆ మాట వినగానే మనసులో నుండి వచ్చే బాధను వర్ణించడం వర్ణణాతీతం . . వాళ్ళ కష్టాలు తీర్చడం మనవల్ల కాదు కానీ వారికి ఒక్కరోజు సంతోషాన్ని మాత్రమే ఇవ్వగల శక్తి ఆ దేవుడు మనకందరికీ ఇచ్చాడు. . మనం రోజులో కనీసం వంద నుండి ఐదు వందల రూపాయల వరకు సంపాదిస్తుంటాం అండ్ ఖర్చు కూడా పెడ్తుంటాం  . . అలా మనం సంపాధించిన అండ్ ఖర్చు పెట్టే ఒక్క రోజు డబ్బుతో వాళ్ళను మనం ఆదరించొచ్చు .. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను రండి చేయి చేయి కలుపుదాం . . ఎవరికి తోచింది వాళ్ళ ఇద్దాం . . వీలైతే వాళ్లను కలిసి మాట్లాడి వాళ్లకు ఒక పూట అన్నం వడ్డీద్దాం . . లేదు మావల్ల కాదంటారా !! అయితే మనవళ్ళ అయిన డబ్బు సహాయం చేద్దాం అది వంద నుండి మీకు తోచినంత వరకు సరేనా . . మదర్ థెరిస్స్తా అంతలా కాకపోయినా మన మనసులో దాగి ఉన్న మానవత్వంతో ఆలోచించండి
ఇంకో విషయం
మిత్రమా మేము చేసే ఒక మంచిలో మీరు భాగస్వాములు కండీ అని నెట్ ప్రపంచంలో ఉన్న లక్షలాది మిత్రులకు
ఈ రోజు ఉదయం ఒక స్రాప్ రూపంలో పెట్టాము. . .మేమున్నామంటూ చాలా మంది ముందుకు వచ్చారు . .
మేము రాలేము మిత్రమా కానీ మా వంతు సహాయంగా మా వల్ల అయినంత సహకారం మేము మీకు ఇస్తాం
అని మరికొంత మంది మిత్రులు ముందుకు వచ్చారు . . లక్షాలాది మిత్రుల కలయికతొ ఏర్పడిన మన నెట్ ప్రపంచంలో
సహాయం చేయడానికి ముందుకు వచింది లక్షమందిలో యాభై మంది మాత్రమేనా ?? ఇదే నా మనషులలో ఉన్న మానవత్వం
ఆకలి వేసిన వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మా అని పలుకుతేనే మనకు మన అమ్మ అన్నం తెచ్చి గోరుముద్దలు చేసి తినిపిస్తుందే . . .
అలాంటి అమ్మానాన్న లేని అనాథ పిల్లలకు ఎవరు అన్నం పెడ్తారు . . . వారు అలా అనాథలుగా సర్వసభ్య సమాజానికి ఎప్పూడూ దూరంగానే ఉండాలా ? మనం మార్పు తేలేమా ? మీ కోసం మేమున్నాము అంటూ వాళ్ళ దెగ్గరికి వెళ్ళి వాళ్ళకు మన వంతు సహాయం అందిస్తూ........ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మీకు కలుగునా ? మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. . మంచి పని చేయడానికి మేము మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాము . . ఆ అవకాశాని సద్వినియోగం చేసుకుంటారో లేక విని వదిలేస్తారో మీ ఇష్టం . . రండి మీకోసం మేమున్నాము అందాం ఒక్కసారైనా !!!
రండి...
సాయం చేయండి...
సేవలో ఉన్న ఆనందాన్ని అస్వాదించండి


ఇంతవరకు నా వేదన విన్నందుకు చాలా థ్యాంక్స్ మిత్రమా . . .ఇక సెలవు @ మీ రసూల్ @                                      
              


మీరు మాతో పాటు చేతులు కలిపి సహాయం చేయాలనుకుంటే ఆర్కుట్ లో ఒక మై & మై ఫ్రెండ్స్ ఫౌండేషన్ లో జాయిన్ కండి మేము నిర్వహించ బోయే ఈవెంట్స్ వివరాలు మీకు అందిస్తాం ... మీకు మేము సహాయం చేయము ఉత్తుత్తిగా చెత్పున్న మాటలు అని అనుకుంటే మీకు వీలైతే అక్కడికి వచ్చి అక్కడ వారిని చూశాక మీరు సహాయం చేయొచ్చు.. కింది లింక్ ని లిక్ చేసి జాయిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మల్లి జాయిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది..

ఆగండి కాస్త ఆలోచించండి.........



ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా. వాస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా  ప్రేమిస్తూ ఉండాలంతే.ప్రేమకు  మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో  మనతో పాటు చావరు.ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి,  ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని  చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు. అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది. లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్  సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..
>>>>>>>>>>>>>>>>>>>
కని పెంచిన అమ్మనాన్నల కోసం ఆత్మ హత్యలు చేసుకోవడం లేదు గాని నాల్గు రోజుల క్రితం పరిచయమైన లేక చూసిన అమ్మాయి తన ప్రేమను తిరస్క రించింది అని ప్రాణ త్యాగం చేస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయం ?????? ఎవరికోసం త్యాగం చేస్తున్నాం ??? నిన్ను కాదన్న ఒక పరిచయం లేని అమ్మాయి కోసమా ????
అందం కనిపిస్తే చూసి ఆశ్వాదించండి  .. . . కాని ఆశ పడితే . .చిన్నప్పటి నుండి ఆశ పడిన ప్రతిదీ మనకు దొరకడం లేదు కదా ఇది అలాగే అనుకోండి . . ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి నీ కోసమే ఎక్కడో పుట్టి ఉంటుంది . . అప్పుడు నువ్వు తన కోసం త్యాగం చేయాల్సిన పని లేదు తనే నీకోసం చేస్తుంది ఏమైనా . .
అసలు నన్ను అడిగితే ప్రేమ అనేది ఒక్క కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల దెగ్గరే దొరుకుతుంది . . ఇక బయట దొరికేవన్ని కూడా అద్దె ప్రేమలో ఏదో ఒకటి చూసి పుడుతుంది. . . నువ్వు ఎంత తిట్టినా , మారాం చేసినా, పెద్ద అయ్యక కొట్టినా నీపై ఎప్పటికీ ప్రేమ తగ్గనిది నీ తల్లిదండ్రులకు ఒకటే . . నీ ప్రియతమ ప్రియురాలుకు కాదు . . . కష్టాల్లోనూ , బాధల్లోనూ , సుఖంలోనూ అన్నింట్లో నీకు తోడుగా ఉండేది నీ స్నేహితులు వారందరినీ కాదని . . ప్రేమ ప్రేమ అని ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా ప్రేమంటే ఏంటో కూడా తెలియ కుండా నువ్వు చెప్పిన నేను నిన్ను ప్రేమించానని అన్న పదాన్ని తిరస్కరించందనే బాధతో దాన్ని ఒక అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకొని తమ భవిష్యత్తును అందకారంలోకి నెట్టుతున్న మహాను భావులు రోజు రోజుకీ పెరిగి పోతున్నారు . . ఇంకొంత మంది తిరస్కరించిందనే నెపంతో తిరస్కరించిన వారిని కూడా హతం చేసి వీరు వారి ప్రాణాలను వదులుతున్నారు. . ఆగండి ఒక్క సారి ఆలోచించండి . ప్రతి చిన్న దానిని కూడా భూతద్దంలో చూసి నేను ఏదో తప్పు చేస్తున్న అని లేక చేసిన తప్పును అవమానంగా భావించి ఆత్మ హత్య చేసుకోవడం ఆపండి .  . ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు . . అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి . . ప్రేమను ప్రేమగా ఆస్వాదించాలంటే ముందు మీరు జీవితంలో ఎదగండి ఆ తర్వాత మీకు నచిన విధంగా చేయండి . ఎవరి కోసమో మీ జీవితాలను పాడు చేసుకోకండి. మీపై ఎంత మంది ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారో కాస్త ఒక్క సారి ఆలోచించండి . . ఒకప్పుడు మీకు ఒక లక్ష్యం  ఉంది . దాన్ని కూడా మర్చి పోయారు.. ఎవరి కోసమో వదిలేశారు . . వద్దు ముందు జీవితంలో ఎదగండి ఆతర్వాత మీకు నచిన విధంగా చేయండి . .
ఆగండి కాస్త ఆలోచించండి..

                                                           Ur's.......Rasool