23, నవంబర్ 2011, బుధవారం

నెట్ అడిక్ట్

కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతీ ఇంట్లోనూ ఉంటున్నాయి. చాలామంది వీటిని తమ చదువులకూ, కెరీర్ కీ ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటూ ఉంటే కొంతమంది.. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, ఇతర ఆన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్, టైమ్ పాస్ సైట్లలోనూ గంటల తరబడి స్పెండ్ చేస్తూ ఇంటర్నెట్ బానిసలుగా మారుతున్నారు. సోషల్ నెట్‌వర్మింగ్ వలలో యువతరం ఏకాగ్రత కోల్పోయి చిన్నపిల్లల్లా తయారవుతున్న వైనం సాటి వారితో మాట్లాడడం కూడా రాని శక్తత పనికిమాలిన విషయాల పట్ల పెరుగుతున్న శ్రద్ధ  మనకు ముక్కూ, ముఖం తెలియని వారు, ఇవాళ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏం  చేశారో తెలుసుకునే వారు ఇంట్లో ఇవాళ్లి బ్రేక్‌ఫాస్ట్ కోసం అమ్మ ఎంత కష్టపడుతోందో పట్టించుకోరు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లంటే పడి చచ్చే వారు, అందులో అకౌంట్లు సృష్టించుకుని ఫ్రెండ్స్ నెట్‌వర్క్‌లను పెంచేసుకునే వారు ఇలాగే తయారవుతున్నారట. పైగా వారిలో ఏకాగ్రత లోపాలు పెరగడమే కాక, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూస్తూ మాట్లాడే శక్తి కూడా ఉండడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. ఇంటర్‌నెట్ వాడకానికి అలవాటు పడిన  యువతీయువకుల్లో.. ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ఎన్నో సైట్లలో రిజిస్టరై..ఒకరితో ఒకరు ఆ సైట్ ఆధారంగానే పరిచయం పెంచుకుంటున్నారు. ముఖాముఖీ తెలియకపోయినా, వారితో తమ ఫొటోలు, వీడియోలు, కాప్షన్లను షేర్ చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం వల్ల యువతీయువకుల్లో తమనెవరూ గుర్తించడం లేదన్న దుగ్ధ, గుర్తించాలన్న కాంక్ష పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చిన్నపిల్లలు ఏదో ఒకటి చేసేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు అమ్మకు చూపిస్తుంటారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు అలవాటు పడిన వారి మనస్తత్వం కూడా ఇలాగే తయారవుతుందని పరిశోధకుల అంచనా. అంటే ఈ సైట్లలో కమ్యూనికేషన్‌కు అలవాటు పడిన వారిలో ఆ సైట్లలో సర్క్యులేషన్‌కు మాత్రమే పనికొచ్చే పనులు తప్పితే మరేమీ చేయలేని అశక్తత పెరిగిపోతోందని తెలిసింది. పైగా స్వల్పకాలంలోనే గుర్తింపు
రావాలన్న తపనతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఆశ్రయించడం వలన, సదరు ఎకౌంట్లలో రిజిస్టరయి ఉన్న ఫ్రెండ్స్ వారిని ప్రశంసిస్తూ ఉంటారు. వాటికి అలవాటు పడిపోయిన వారు అదే స్పందన బయట కానరాకపోతే.. ఇబ్బంది పడిపోతున్నారని తామేం చేస్తున్నామో తమ ఫ్రెండ్స్‌కు తెలియాలని ఆయా మెసేజ్‌లు పోస్ట్ చేస్తుంటారు. దీని వలన ప్రజలు నెట్‌లో తప్పితే నిజంగా లేని ప్రపంచంలో బతకడానికి అలవాటు పడిపోతున్నారని నా అభిప్రాయం

                                                           Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి