23, నవంబర్ 2011, బుధవారం

ఉదయం లేచినప్పుడు ముందుగా మన నోటి నుండి వచ్చే కమ్మనైన మాట అమ్మ

మనం అభిమన్యులం కాదు, అర్జునులం కాదు, కుభేరులం అంతకన్నా కాదు... ప్రజలందరిలో సామాన్యులం మనం. దేవుడుకష్టాలను ఇస్తాడు, కష్టాలను తీర్చడానికి మానవ రూపంలో సాయము చేస్తాడు. మానవ సాయంలో మనం ఒకరంఅవ్వాలనే ఉద్దేశ్యంతో నేను రాస్తున్నాను నా ఈ ఆరు గంటల స్రాప్
మనబిజీబిజీ, గజిగజి జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి, రాత్రి పడుకునే వరకు ఆనాధ పిల్లలను, వృద్ధులను, వికలాంగులను, విద్యాగంధానికి దూరమైన దురదృష్టవంతులను, సాయం కోసం ఎదురు చూసే వారిని చూస్తూ వుంటాం. క్షణం మన మదిలో వారికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. కాని అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయగానేమన ఆలోచనలు వెనకబడిపోతాయి లేదా ఏవో అనివార్య కారాణాల వలన చేయలేము. తరువాత ఏదో సందర్భంలో ఆలోచన వచ్చినపుడు వారికి ఏదైనా చేయాలి అనుకున్నాం, ఏమి చేయలేదు, ఏదో రకంగా సాయపడాలి, కాని ఏమిచేయాలి! మన ఒక్కరి వల్ల అవుతుందా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. కానీ ఆ ఆలోచన అంత వరకే ఆపేస్తారు అలా ఆపకూడదనే నేను నా స్రాప్ ద్వారా మీకు చెప్పదలచుకున్నాను !! తప్పులుంటే మన్నీంచండి . .
ఉదయం లేచినప్పటి నుండి  ముందుగా మన నోటి వెంట నుండి వచ్చే కమ్మనైన మాట అమ్మ . . . .
ఏ కష్టమైనా వచ్చినా చెప్పుకోవడానికి నాన్న, అన్న, తమ్ముడు,  తోబుట్టువులు అందరు మనకున్నారు . .
కానీ ఎవరూ లేని అనాథ పిల్లలు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు . . . అలాంటి పిల్లలను చూడగానే అయ్యే అని బాధపడటం తప్ప
ఏమీ చేయలేని పరిస్థితి మన అందరిదీ. . .
నేను నిజమే చెప్తున్నాను . . బయట ఎప్పుడైనా మన పనుల కోసం వెళ్ళి నప్పుడు మనకు ముందుగా కనపడేది . .
వీధి బాలలు  . . అన్నా, అక్కా అంటూ దెగ్గరికి వచ్చి ఒక్కరూపాయి ఇవ్వు అన్నా, అక్కా అంటూ చేతులు చాచి అడుగుక్కుంటూ వాళ్లని చూసి మనసు కరిగి పోయి మనదెగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాం . .
ఇక్కడ మనం మన మానవత్వాన్ని చాటు కుంటున్నాం . . అలాంటి వీధి బాలలను (అనాథ పిల్లలను) కొన్ని అనాథాశ్రయాలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నాయి . . అలాంటి అనాథాశ్రయంలో పెరిగిన పిల్లల పోషణకు , కనీస సౌఖర్యాలకు అవసరమైన డబ్బులు ప్రభుత్వం నుండి సరిగా రావడం లేదు . . అయినా కూడా బాధ పడకుండా ఆ అనాథపిల్లల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా వాటిని నిర్వహిస్తునే ఉన్నారు . . ఆ అనాథ పిల్లల్లో చాలా మంది వేసే ఒకే ఒక్క ప్రశ్న మాకెవరున్నారు మా ఆలనా పాలన చూడడానికి ఎవరు ఉన్నారు అని ? ఆ మాట వినగానే మనసులో నుండి వచ్చే బాధను వర్ణించడం వర్ణణాతీతం . . వాళ్ళ కష్టాలు తీర్చడం మనవల్ల కాదు కానీ వారికి ఒక్కరోజు సంతోషాన్ని మాత్రమే ఇవ్వగల శక్తి ఆ దేవుడు మనకందరికీ ఇచ్చాడు. . మనం రోజులో కనీసం వంద నుండి ఐదు వందల రూపాయల వరకు సంపాదిస్తుంటాం అండ్ ఖర్చు కూడా పెడ్తుంటాం  . . అలా మనం సంపాధించిన అండ్ ఖర్చు పెట్టే ఒక్క రోజు డబ్బుతో వాళ్ళను మనం ఆదరించొచ్చు .. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను రండి చేయి చేయి కలుపుదాం . . ఎవరికి తోచింది వాళ్ళ ఇద్దాం . . వీలైతే వాళ్లను కలిసి మాట్లాడి వాళ్లకు ఒక పూట అన్నం వడ్డీద్దాం . . లేదు మావల్ల కాదంటారా !! అయితే మనవళ్ళ అయిన డబ్బు సహాయం చేద్దాం అది వంద నుండి మీకు తోచినంత వరకు సరేనా . . మదర్ థెరిస్స్తా అంతలా కాకపోయినా మన మనసులో దాగి ఉన్న మానవత్వంతో ఆలోచించండి
ఇంకో విషయం
మిత్రమా మేము చేసే ఒక మంచిలో మీరు భాగస్వాములు కండీ అని నెట్ ప్రపంచంలో ఉన్న లక్షలాది మిత్రులకు
ఈ రోజు ఉదయం ఒక స్రాప్ రూపంలో పెట్టాము. . .మేమున్నామంటూ చాలా మంది ముందుకు వచ్చారు . .
మేము రాలేము మిత్రమా కానీ మా వంతు సహాయంగా మా వల్ల అయినంత సహకారం మేము మీకు ఇస్తాం
అని మరికొంత మంది మిత్రులు ముందుకు వచ్చారు . . లక్షాలాది మిత్రుల కలయికతొ ఏర్పడిన మన నెట్ ప్రపంచంలో
సహాయం చేయడానికి ముందుకు వచింది లక్షమందిలో యాభై మంది మాత్రమేనా ?? ఇదే నా మనషులలో ఉన్న మానవత్వం
ఆకలి వేసిన వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మా అని పలుకుతేనే మనకు మన అమ్మ అన్నం తెచ్చి గోరుముద్దలు చేసి తినిపిస్తుందే . . .
అలాంటి అమ్మానాన్న లేని అనాథ పిల్లలకు ఎవరు అన్నం పెడ్తారు . . . వారు అలా అనాథలుగా సర్వసభ్య సమాజానికి ఎప్పూడూ దూరంగానే ఉండాలా ? మనం మార్పు తేలేమా ? మీ కోసం మేమున్నాము అంటూ వాళ్ళ దెగ్గరికి వెళ్ళి వాళ్ళకు మన వంతు సహాయం అందిస్తూ........ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మీకు కలుగునా ? మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. . మంచి పని చేయడానికి మేము మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాము . . ఆ అవకాశాని సద్వినియోగం చేసుకుంటారో లేక విని వదిలేస్తారో మీ ఇష్టం . . రండి మీకోసం మేమున్నాము అందాం ఒక్కసారైనా !!!
రండి...
సాయం చేయండి...
సేవలో ఉన్న ఆనందాన్ని అస్వాదించండి


ఇంతవరకు నా వేదన విన్నందుకు చాలా థ్యాంక్స్ మిత్రమా . . .ఇక సెలవు @ మీ రసూల్ @                                      
              


మీరు మాతో పాటు చేతులు కలిపి సహాయం చేయాలనుకుంటే ఆర్కుట్ లో ఒక మై & మై ఫ్రెండ్స్ ఫౌండేషన్ లో జాయిన్ కండి మేము నిర్వహించ బోయే ఈవెంట్స్ వివరాలు మీకు అందిస్తాం ... మీకు మేము సహాయం చేయము ఉత్తుత్తిగా చెత్పున్న మాటలు అని అనుకుంటే మీకు వీలైతే అక్కడికి వచ్చి అక్కడ వారిని చూశాక మీరు సహాయం చేయొచ్చు.. కింది లింక్ ని లిక్ చేసి జాయిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మల్లి జాయిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి