ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా. వాస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా ప్రేమిస్తూ ఉండాలంతే.ప్రేమకు మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో మనతో పాటు చావరు.ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి, ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు. అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది. లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్ సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..
>>>>>>>>>>>>>>>>>>>
కని పెంచిన అమ్మనాన్నల కోసం ఆత్మ హత్యలు చేసుకోవడం లేదు గాని నాల్గు రోజుల క్రితం పరిచయమైన లేక చూసిన అమ్మాయి తన ప్రేమను తిరస్క రించింది అని ప్రాణ త్యాగం చేస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయం ?????? ఎవరికోసం త్యాగం చేస్తున్నాం ??? నిన్ను కాదన్న ఒక పరిచయం లేని అమ్మాయి కోసమా ????
అందం కనిపిస్తే చూసి ఆశ్వాదించండి .. . . కాని ఆశ పడితే . .చిన్నప్పటి నుండి ఆశ పడిన ప్రతిదీ మనకు దొరకడం లేదు కదా ఇది అలాగే అనుకోండి . . ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి నీ కోసమే ఎక్కడో పుట్టి ఉంటుంది . . అప్పుడు నువ్వు తన కోసం త్యాగం చేయాల్సిన పని లేదు తనే నీకోసం చేస్తుంది ఏమైనా . .
అసలు నన్ను అడిగితే ప్రేమ అనేది ఒక్క కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల దెగ్గరే దొరుకుతుంది . . ఇక బయట దొరికేవన్ని కూడా అద్దె ప్రేమలో ఏదో ఒకటి చూసి పుడుతుంది. . . నువ్వు ఎంత తిట్టినా , మారాం చేసినా, పెద్ద అయ్యక కొట్టినా నీపై ఎప్పటికీ ప్రేమ తగ్గనిది నీ తల్లిదండ్రులకు ఒకటే . . నీ ప్రియతమ ప్రియురాలుకు కాదు . . . కష్టాల్లోనూ , బాధల్లోనూ , సుఖంలోనూ అన్నింట్లో నీకు తోడుగా ఉండేది నీ స్నేహితులు వారందరినీ కాదని . . ప్రేమ ప్రేమ అని ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా ప్రేమంటే ఏంటో కూడా తెలియ కుండా నువ్వు చెప్పిన నేను నిన్ను ప్రేమించానని అన్న పదాన్ని తిరస్కరించందనే బాధతో దాన్ని ఒక అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకొని తమ భవిష్యత్తును అందకారంలోకి నెట్టుతున్న మహాను భావులు రోజు రోజుకీ పెరిగి పోతున్నారు . . ఇంకొంత మంది తిరస్కరించిందనే నెపంతో తిరస్కరించిన వారిని కూడా హతం చేసి వీరు వారి ప్రాణాలను వదులుతున్నారు. . ఆగండి ఒక్క సారి ఆలోచించండి . ప్రతి చిన్న దానిని కూడా భూతద్దంలో చూసి నేను ఏదో తప్పు చేస్తున్న అని లేక చేసిన తప్పును అవమానంగా భావించి ఆత్మ హత్య చేసుకోవడం ఆపండి . . ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు . . అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి . . ప్రేమను ప్రేమగా ఆస్వాదించాలంటే ముందు మీరు జీవితంలో ఎదగండి ఆ తర్వాత మీకు నచిన విధంగా చేయండి . ఎవరి కోసమో మీ జీవితాలను పాడు చేసుకోకండి. మీపై ఎంత మంది ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారో కాస్త ఒక్క సారి ఆలోచించండి . . ఒకప్పుడు మీకు ఒక లక్ష్యం ఉంది . దాన్ని కూడా మర్చి పోయారు.. ఎవరి కోసమో వదిలేశారు . . వద్దు ముందు జీవితంలో ఎదగండి ఆతర్వాత మీకు నచిన విధంగా చేయండి . .
ఆగండి కాస్త ఆలోచించండి..

పీకల్లోతు ప్రేమలో వున్నవాళ్ళకు ఇవి ఏమి పట్టవు కదా
రిప్లయితొలగించండి