18, మార్చి 2012, ఆదివారం

ఒక్క ముద్ద

ఈ ఒక్క ముద్ద నా ఆకలి తీర్చింది...
ఈ ముద్ద తినకుండా పడేసిన ఆ దేవుడికి నా దణ్ణాలు!!!

పూటకో రకమైన వంటకాలను తినే వాడికేం తెలుసు ఆకలి బాధెంతో..
పది రోజులకు ఒకసారి తినే ఆ వృద్దఅంగవికాలాంగుడిని అడుకు చెబుతాడు..
ఆకలి మీద ఎన్నో నిజమైన కథనాలు, మరెన్నో సంఘటనలు మన దృష్టికి వచ్చినా..
వాటిని చదివినప్పుడూ, మన కళ్లతో చూసినప్పుడు మాత్రమే మనలో దాగున్న
మనిషి బయటికి వస్తాడు..అయ్యే అయ్యయే అనేస్తాం..
పక్కకు పోయిన వెంటనే యధావిధిగా ఉండిపోతున్నాం..
నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నాను..
ఇప్పుడు కూడా చెప్తున్నా...
మనలో చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు...
అలాంటి వాళ్లకు నాదొక సలహా..
ప్రతి రోజు కాకుండా నెలకోక్కసారి ..
మీరు సంపాదించిన ఆదాయంలో ఒక్క వంద రూపాయలతో
ఒక్క ఆకలి కడుపును నింపడానికి ప్రయత్నించండి..
మీరు నెల తినే ముద్దల్లో ఒక్క ముద్ద వేసి
ఒక ఆకలిని తీర్చండి...
మీరు నన్ను అడగొచ్చు నువ్వు చేస్తున్నావా ? అని...
నేను చేయడం మొదలు పెట్టిన తర్వాతే ఈ స్రాప్ రాస్తున్నా..
ఎవరెన్ని చేసినా , ఎంత చేసినా కానీ
ఆకలితో చనిపోయేవారి సంఖ్యను తగ్గించలేక పోతున్నాం...

అన్ని దానాలలో కెళ్ళా కడుపు నింపే అన్నదానమే గొప్పది.
(చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక స్రాప్ రాశాను)


                                    
Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి