18, మార్చి 2012, ఆదివారం

ఐస్ క్రియోయ్ !!! ఐస్ క్రియోయ్ !!!

( ఓ మధుర జ్ఞాపకం)


పైన చూపిన సిత్రం మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఓ మధుర జ్ఞాపకాన్ని గుర్తుకు చేసింది..
ఆ రోజు శనివారం తెల్లవారింది .... స్కూలు కెళ్ళాలి .... అని .. అమ్మ లేవరా అంటూ అర్తుస్తుంది .. చలికాలం కాబట్టి లేవడానికి బాడీ సహకరించడం లేదు .. టైం అయిపోతుంది.. అమ్మకు కోపం వచ్చింది .. వేడి నీళ్ళు తెచ్చి వీపు మీద వేసే సింది .. ఆ చల్లని వాతావరణానికి ఆ వేడి నీరు నాకు వెచ్చగా అని పించాయి... నీళ్ళు వేసినా నిద్ర లేవలేదు... అమ్మకు ఇంకా కోపం వచ్చింది ... ఏం చేసినా లేవడం లేదని ఈ సారి నాన్నకు చెప్పింది..నాన్న అక్కకు ,అక్క అన్నకు చెప్పింది.... నన్ను లేపమని  .. ఇంత మంది కష్టపడుతున్నారు.  నన్ను నిదుర లేపడానికి కానీ నేను మాత్రం హాయిగా పడుకుండి పోయా.. అన్నయ్య  నా దెగ్గరకు వచ్చి రేయ్ ఇప్పుడు త్వరగా లేచి స్కూల్ కెళ్ళి వస్తే సాయంత్రం ఐస్ తినిపిస్తా అన్నాడు .. మ్ హూ ... లేవలేదు ... అన్ని వినిపిస్తునాయి కానీ కళ్ళు తెరవడానికి మాత్రం బద్దకం .. ఐస్ + సైకిల్ నేర్పిస్తా అన్నాడు ( నాకు అప్పటికీ సైకిల్ రాదు సైకిల్ నేర్చుకోవాలని చాలా రోజుల నుండి అడిగేవాన్ని అందుకే అలా అన్నాడు).. వెంటనే లేచి పదా అన్నాను .. ఇప్పుడు కాదు సాయంత్రం అన్నాడు .. కాదు ఇప్పుడే అన్నాను .. కాదు సాయంత్రం అయితేనే నేర్పిస్తా అన్నాడు ... సర్లే అని రెడీ అయి స్కూల్ కెళ్ళి సాయంత్రం ఇంటి కొచ్చి చూస్తే అన్నయ్య లేడు .. ఇంకా ఇంటికి రాలేదు .. ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఇంటి బయటికి వచ్చాను అక్కడ మా దోస్తులు బొంగరాలు ఆట & గోళీలాట ఆడుకుంటున్నారు.. మనకు ఇంకేం పని ఉంది అని నేను జాయిన్ అయిపోయా ... రాత్రి అయింది అన్నయ్య ఇంకా రాలేదు.. నిద్ర పోయాను..ఎప్పుడు వచ్చాడో అన్నయ్య..ఆ రోజు అలా గడిచి పోయింది .. మరుసటి రోజు ఆది వారం కావడంతో ఎవరు నన్ను లేపలేదు .. కానీ నేనే త్వరగా లేచాను
.. సైకిల్ నేర్పిస్తాడేమో అని .. కానీ అప్పటికే అన్నయ్య పనికి వెళ్లి పోయాడు..ఏడ్చుకుంటూ బయటికి వచ్చి అరుగు మీద కూర్చున్నా నాకన్న చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు..నాకు కోపం వచ్చింది .. ఇంట్లో ఉన్న సైకిల్ తీసుకుని పెద్ద గ్రౌండుకు వెళ్లాను.. సైకిల్ పెద్దది నేను దాని చక్రం అంత ఉన్నాను.. అక్కడికీ కష్ట పడ్దాను కానీ చాలా సార్లు కింద పడ్డాను..రాలేదు.. ఒకతను వచ్చి బాబు ముందు చిన్న సైకిల్ నేర్చుకుని తర్వాత పెద్ద సైకిల్ నడపాలి అన్నాడు.. కానీ నేనెందుకు వింటాను అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నించాను..కింద పడి బట్టలు చింపుకొని, దెబ్బలు తగిలించుకుని ఇంటి కొచ్చాను..సైకిల్ కి ఒక్క డ్యామేజ్ కాలేదు .. నాకు అంతా డ్యామేజ్ .. ఇంటికి వస్తే నన్ను చూసిన మా అమ్మ .. నన్ను ఇంకా డ్యామేజ్ చేయడానికి ట్రై చేసింది..బాబోయ్ నేను దొరుకుతానా .. పారిపోయా..అలా వేరే వీధికి వచ్చాను .. అక్కడ ఉన్న మా దోస్తులతో కలసి .. మాట్లాడుకుంటూ అలా అలా వెళ్లాము..అక్కడ ఒక ఐస్ క్రీం ఫ్యాక్టరీ కనపడింది.. అక్కడికి వెళ్ళి ఐస్ కొనుక్కొని ఇద్దరం తింటున్నాము..అంతలో ఒకబ్బాయి ఐస్ బాక్స్ తెచ్చి అందులో ఐస్ క్రీమ్స్ నింపుకొని వెళ్ళాడు..వెళ్తూ రూ.10ల ఐస్ క్రీం లకు రూ. 5 మాత్రమే ఇచ్చాడు.అప్పట్లో ఒక్క ఐస్ క్రీం ఇరవై అయిదు పైసలు (0.25) మాత్రమే .. నాకు అర్థం కాలేదు అలా ఒక ముగ్గురు వచ్చి వెళ్ళారు.. ఏంటి అని మా దోస్తును అడిగితే వాడు చెప్పాడు.. ఏం లేదురా పది రూపాయల ఐస్ క్రీమ్స్ అమ్మితే ఐదు రూపాయలు అమ్మిన వాడికి ఇంకో ఐదు రూపాయలు ఐస్ క్రీం తయారు చేసిన వారు తీసుకుంటారు అన్నాడు..నాకు వెంటనే ఒకతను చెప్పిన మాట అదే ముందు చిన్న సైకిల్ నేర్చుకో అన్న విషయం గుర్తుకొచ్చింది.. మా ఇంట్లో ఏమో చిన్నది లేదు సో రెంట్ కు ఇస్తారు .. ఒక గంటకు ఒక్క రూపాయి .. సో నేను నేర్చుకోవాలి కానీ ఇంట్లో అడిగితే అంత పెద్ద అమౌంటు ( అప్పట్లో ఒక్క రూపాయికి చాలా విలువ ఉండేది..) ఇవ్వరేమో అని నేనే సంపాదించి నేర్చుకుందాం అని నిశ్చయించుకుని మా స్నేహితుడికి చెప్పాను... రేయ్ ఐస్ క్రీమ్స్ అమ్ముదాం .. మనకు వచ్చిన  5 రూపాయల్ని చెరి సగం తీసుకుందాం అన్నాను..తను సరే అన్నాడు.వెంటనే ఐస్ క్రీం అతనికి చెప్పి ఒక బాక్స్ , బాక్స్ లో ఐస్ క్రీమ్స్ తీసుకుని బయలు దేరాము..అమ్మడానికి ... అడుగడుగునా అడిగే వారు నువ్వు ఫలానా వాళ్ళ కొడుకువి కదా అని .... నాకు చాలా సిగ్గేసింది.. వాళ్ల అలా అడుగుతుంటే ... ఇలా కాదు అని ఎప్పుడు వెళ్లని వీధికి వెళ్ళాము.. మా దోస్తుకు చెప్పాను రేయ్ గట్టిగా అరువు అని .. ఏమని అన్నాడు.. నేను ప్రాక్టికల్ గా ఐస్ క్రియోయ్ అని ఒక నాలుగు సార్లు అరిచాను వెంటనే అక్కడ మా ఇంటి పక్కనే ఉన్న ఆంటి బయటికి వచ్చింది..నాకు పడింది పిడి..తను అడిగేసింది .. నీకేం పిచిరా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నావ్ అని చెప్పింది.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి నేను కాదు మా ఫ్రెండ్ అముతుంతే నేను తోడుగా వచ్చాను అని ...ఆంటి ఇవి ఫ్రీ అని చెప్పాను..తను ఇదే అదునుగా బాక్స్ లో ఉన్న నాలుగు ఐస్ క్రీమ్స్ దొబ్బేసింది...ఒక్కరూపాయి పోయింది.... ఈ సారి ఇలా కాదు అని నాకు తెలిసిన వారు కనపడితే బాక్స్ మా దోస్తుకు ఇచ్చేవాన్ని వాడికి ఎవరైనా తెలిసిన వాళ్లు కనపడితే నాకు ఇచ్చేవాడు అలా కష్ట పడుతూ ఊరు మొత్తం తిరిగి తిరిగి చివరికి మూడు గంటల తర్వాత అన్ని అమ్మశాము...బాక్స్ ఇచ్చేసి వచ్చిన నాలుగు రూపాయల్లో చెరి రెండు రూపాయలు తీసుకొని బయటికి వచ్చాము .. ఇక మా దోస్తు వాళ్ళ ఇంటికెళ్లి పోయాడు..కానీ నేను మాత్రం వెళ్లలేదు.. సైకిల్ రెంట్ షాప్ కెళ్ళి రెండు రూపాయలు ఇచ్చి రెండు గంటలు రెంట్ కు తీసుకుని గ్రౌండు కొచ్చి రెండు గంటలు కష్టపడి కింద మీద పడి మళ్ళీ దెబ్బలు తగిలించుకొని ఆఖరికి చిన్న సైకిల్ మీద గెలిచేశాను...ఆ ఆనందంతో సైకిల్ వాళ్లకు సైకిల్ ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చాను... అప్పటికే అన్నయ్య ఇంట్లో ఉన్నాడు..నన్ను చూసి కోపడ్డాడు కానీ ఏమనకుండా వెళ్లి ముందు స్నానం చేసి తినుపో అన్నాడు.. అమ్మయ్య్య ఏమనలేదు అని వెళ్ళి చెప్పినట్లే చేశాను.. అన్నం తినేశాక దెగ్గరికి వచ్చి ఒక్కటి లాగి పీకాడు..దెబ్బకు గోడకు అతుక్కుని పోయా.. ఏరా ! ఐస్ క్రీమ్స్ అమ్ముతావా ? ఎందుకు అమ్మావ్ అన్నాడు .. నేను కారణం చెప్పాను.. డబ్బులు కావాలంటే నన్ను అడుగు అంతే కాని అవి ఇవి అమ్మడం చేశావో చంపేస్తా అన్నాడు...నేను ఏడ్చుకుంటూనే ఐదు రూపాయలు ఇమ్మని అడిగా ఎందుకు రా అన్నాడు సైకిల్ నేర్చుకోవాలి నేను రెంట్ కు డబ్బులు కావాలి కదా అన్నాను.. మా అన్నయ్య దానికి డబ్బులు అవసరం లేదు అని పెద్ద సైకిల్ తీసుకుని మా అన్నయ్యే స్వయంగా నాకు నేర్పించాడు..ఇలా నేను సైకిల్ నేర్చేసుకున్నా... ఐస్ క్రియోయ్ !!! ఐస్ క్రియోయ్ !!!
అప్పటి నేను సైకిల్ నేర్చుకునే రోజుల్లో దిగిన ఫోటో 

                                                           Ur's.......Rasool

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి